Read more!

English | Telugu

నోరు జారేసిన అభినవ్ గోమటం...అనసూయ టార్చర్ పెడుతుంది

 

ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజేంద్ర ప్రసాద్, కోటా, బ్రహ్మానందం, బాబుమోహన్ మూవీస్ పెట్టుకుని ఫుల్ ఛిల్ అవుతూ ఉంటారు. ఇక ఆ జెనెరేషన్ వాళ్ళ టైం ఐపోయింది. ఇప్పటి  జెనెరేషన్ వాళ్ల కోసం  యంగ్ కమెడియన్స్ చాలా మంది వచ్చేసారు. వాళ్ళే ప్రియదర్శి, అభినవ్ గోమటం లాంటి వాళ్ళు. వీళ్ళను చూస్తే చాలు ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. వీళ్ళు నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ఐతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అభినవ్ గోమటంతో ఇంటర్వ్యూ చేసింది రీతూ చౌదరి. దావత్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి వచ్చాడు అభినవ్. ఐతే ఒకసారి విశ్వక్ సేన్ బర్త్ డేకి వాళ్ళ ఫ్రెండ్ ఒక కేక్ తెచ్చాడట. అది కాస్తా ఫీమేల్ షేప్ లో ఉండేసరికి  అది తినాలా వద్దా అంటూ భయపడ్డానని తడబడుతూ చెప్పాడు.

"పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. ఊరికే అడుగుతున్నా" అనేసరికి "నువ్వు రెడీనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఐనా ఊరికే నా పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నావు" అన్నాడు.. "ఒకవేళ యాంకర్ కాకపోయి ఉంటే ఎం చేసేవాళ్ళు" అని అభినవ్ రీతూని అడిగేసరికి "డైరెక్టర్ ని అయ్యేదాన్నేమో" అని చెప్పింది. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చింది రీతూ. "ఇంకా టార్చర్ ఒక్కటే మిగిలింది అది అనసూయకు ఇచ్చేస్తున్నా..అనసూయ ఏమీ అనుకోకు. యు టార్చర్డ్" అని చెప్పాడు అభినవ్. "నెక్స్ట్ థంబ్ నెయిల్, నెక్స్ట్ లైవ్ మీ గురించే" అంటూ రీతూ కూడా అనసూయను ఉద్దేశించి మాట్లాడేసింది.  చివరికి అభినవ్ "ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సన్నీ లియోన్ ది ప్రీవియస్ వర్క్ చూసేవాడిని" అని చెప్పేసరికి రీతూకి ఎం అర్దమయ్యిందో కానీ పడీ పడీ నవ్వేసింది. అభినవ్ కూడా నవ్వుతూ "నాతో ఉండి చెడిపోయేదేమో కానీ వీళ్ళతో ఉండి నేను చెడిపోతున్నా" అని రీతూను మెన్షన్ చేస్తూ చెప్పాడు.