English | Telugu
రాజ్ కి కంపెనీ బాధ్యతలు అప్పగించిన సీతారామయ్య!
Updated : Feb 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ -8 లో... స్వప్న కి డాన్స్ నేర్పిస్తుంది కావ్య. అటుగా వస్తున్న రాజ్.. ఒక తెర వెనకాల నుండి డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తూ అలానే ఉండిపోతాడు. అక్కడ డాన్స్ చేస్తుంది కావ్య..
సీతారామయ్య కంపెనీ బాధ్యతలు రాజ్ కి అప్పగించాడు. దానికి మినిస్టర్ గారు అతిథులుగా వస్తారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా.. స్వప్న డ్యాన్స్ చేస్తుంది. వెనకాల వైపు కావ్యని చూస్తూ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది స్వప్న. స్టేజ్ మీద ఒక నిప్పు బొగ్గు ముక్క పడిపోతుంది. దాని మీద ఎక్కడ స్వప్న అడుగేస్తుందేమోనని కావ్య పరుగెత్తుకుంటూ వచ్చి కాలు వేయకుండా తన చేతిని అడ్డుగా పెడుతుంది. కావ్య చేతి మీద కాలు వేయడంతో స్వప్న పడిపోతుంటుంది. అలా స్పప్న కిందపడిపోతుంటే పక్కనే ఉన్న రాజ్ వెళ్లి పట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత కావ్యని చూసిన రాజ్ కోపంతో ఊగిపోతూ "నువ్వా.. మళ్ళీ ఎందుకొచ్చావ్ నువ్వు ఎక్కడుంటే అక్కడ బొగ్గే" అని అంటాడు. దానికి కావ్య "మాటలు జాగ్రత్తగా రానివ్వండి " అని అంటుంది.
కాసేపు కావ్య, రాజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చివరగా తనకి సారి చెప్తే వెళ్తానని అంటుంది కావ్య. దానికి రాజ్ పొగరుగా "నీకు సారీనా.. నేను చెప్పను" అని సమధానమిస్తాడు. దీంతో కనకం ఈ గొడవ ఇంకా పెరిగేలా ఉందని గమనించి డైవర్ట్ చేయాలని ఆలోచిస్తుంది. వెంటనే పరుగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి "అయ్యో అయ్యో .. దెబ్బ తగిలిందా.. కాలు బెణికిందా అమ్మా" అని స్వప్నకి సైగ చేయగా.. తను అవును కాలు బెణికింది అన్నట్టుగా యాక్ట్ చేస్తుంది.
ఆ తర్వాత రాజ్ "చూడు నీవల్లే ఇలా జరిగింది" అని కావ్యని అంటాడు. స్వప్న తనని ఆపి.. "రాజ్ బదులు నేను సారీ చెప్తున్నా" అని అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళి మెల్లిగా బ్రతిమాలి తనని వెళ్ళమంటుంది స్వప్న. ఇక రాజ్ సెక్యూరిటీతో కావ్యని బయటకు పంపించాలనుకుంటాడు. రాజ్ పొగరును చూసి.. "ఈ జన్మలో ఈ ఇంటికి రాను" అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.