'మురారి'లో మహేశ్ తండ్రి పాత్రను చేజేతులా ప్రసాద్‌బాబుకు అప్పగించిన నరసింహరాజు!
మహేశ్ టైటిల్ రోల్ చేసిన 'మురారి' సినిమా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ఆదరణను పొందింది. నిజానికి ఆ సినిమా మహేశ్‌లోని నటుడ్ని తొలిసారి ఆవిష్కరించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. మహేశ్, సోనాలీ బెంద్రే జంట చూడముచ్చటగా ఉందని అందరూ అన్నారు. ఆ మూవీలో మహేశ్ తల్లితండ్రులుగా లక్ష్మి, ప్రసాద్‌బాబు నటించారు. నిజానికి తండ్రి క్యారెక్టర్ చెయ్యాల్సింది 'జగన్మోహిని' హీరో నరసింహరాజు.