నానితో మరోసారి గాంధీ!?
మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ ని అందుకున్న తెలుగు దర్శకుల్లో మేర్లపాక గాంధీ ఒకరు. 2013లో సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`తో గాంధీ దర్శకప్రస్థానం మొదలైంది. ఆపై రెండో చిత్రం `ఎక్స్ ప్రెస్ రాజా` (2016)తోనూ ఇంప్రెస్ చేశాడు మేర్లపాక. శర్వానంద్, సురభి కాంబోలో వచ్చిన సదరు చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే, మూడో చిత్రంగా మంచి అంచనాల నడుమ విడుదలైన 2018 నాటి `కృష్ణార్జున యుద్ధం` (నాని, అనుపమ పరమేశ్వరన్) మాత్రం నిరాశపరిచింది. అలాగే, గత ఏడాది ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ అయిన `మాస్ట్రో` (నితిన్, తమన్నా, నభా నటేశ్) కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.