రజని అంటే రాజేంద్రప్రసాద్‌కు ఇంట్రెస్ట్.. ఎందుకంటే..!
తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన సినీ జంటల్లో రాజేంద్రప్రసాద్, రజని జోడీ ప్రముఖమైంది. జంధ్యాల సినిమా 'అహ నా పెళ్లంట' (1987)లో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని, రొమాన్స్‌ను అంత త్వరగా మర్చిపోగలమా! ఆ సినిమాతో పాటు భలే మొగుడు, గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవన గంగ, చిక్కడు దొరకడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం, గడుగ్గాయి లాంటి సినిమాలతో హిట్ పెయిర్‌గా పేరుపొందారు.