English | Telugu

వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్...

బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" మూవీతో తానేంటో తన నటన ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు "నేను స్టూడెంట్ సర్" అనే మూవీ చేసాడు. అది రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో చిట్ చాట్ చేశారు. ఆడియన్స్ అడిగిన ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్పాడు.  "అన్న లాగా కమర్షియల్ స్క్రిప్ట్స్  కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నారు..కారణం ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు " కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదు. డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేసి ఆడియన్స్ కి చూపించాలంటే ఇష్టం నాకు. ప్రస్తుతానికి నాకు మార్కెట్ లేదు.

దేవయాని, శైలేంద్రలకి మాస్ వార్నింగ్ ఇచ్చిన జగతి.. రిషి ఆచూకి మహేంద్రకి తెలుస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -777 లో.. రిషి దారిలో ఉన్న ఆ అమ్మాయి కార్ రిపేర్ చేస్తుంటాడు. అప్పుడు మీరు‌ రిషి కదా అని ఆ అమ్మాయి అంటుంది. నేను మీకు తెలుసా అని రిషి అడుగగా.. అయ్యో రిషి.. నేను మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఏంజిల్ ని అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. గుర్తుపట్టావా అని ఏంజిల్ అడుగగా.. హా గుర్తుపట్టానని రిషి అంటాడు. ఆ తర్వాత మనమిద్దరం మళ్ళీ కలుద్దాం.. నేనొక అర్జెంట్ పనిమీద వెళ్తున్నానని చెప్పి తన విజిటింగ్ కార్డ్ రిషికి ఇచ్చి ఏంజిల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

విజయప్రకాష్ ప్లేస్ లో కొత్త జడ్జిగా కృష్ణమూర్తి

"పాడుతా తీయగా" సీజన్ 22 జూన్ 5 వ తేదీ నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ సిరీస్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కొత్త సీజన్ కి ఒక కొత్త జడ్జి కూడా వచ్చారు. ఈ షో ఇప్పటి వరకు 21  సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇకపోతే 2021 నుంచి నిన్నటి సీజన్ 21  వరకు  జడ్జెస్ గా సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వ్యవహరించారు. ఐతే ఈ  కొత్త సీజన్ కి విజయ్ ప్రకాష్ ప్లేస్ లోకి సీనియర్ సింగర్ శ్రీనివాస మూర్తి వచ్చారు. ఆయన స్టేజి మీదకు రాగానే ఎస్పీ చరణ్ ని హగ్ చేసుకున్నారు. "మీకు నాన్నగారికి మధ్య అనుబంధం ఎప్పటి నుంచి ఎలా మొదలయ్యింది" అని చరణ్ అడిగారు. "ఈరోజు నేను ఇలా ఉండడానికి కర్త, కర్మ, క్రియ బాలు గారే.." అని చెప్పారు.

శేఖర్ మాష్టర్ కి లెటర్ రాసిన శ్రీలీల

ఢీ 15  ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో ప్రదీప్ చాలా ప్రశ్నలు అడిగాడు శ్రీలీల కూడా అలాగే ఆన్సర్స్ ఇచ్చింది. "శ్రీలీల గారు మీరు ఏ సీజన్ లో ఐనా ఒకేలా ఉంటారనే విషయం తెలిసింది.. మాములుగా అందరికీ వర్ష కాలంలో జలుబు వస్తుంది...సమ్మర్ లో వేడిగా ఉంటుంది. మీరు మాత్రం సమ్మర్, వింటర్,  రైనీ సీజన్ అని లేకుండా అదే పనిగా తుమ్ముతూ ఉంటారట" అని అడిగాడు. "కరెక్ట్ అండి..నాది పొడుగు ముక్కు కదా..కొంచెం ముక్కు ప్రాబ్లమ్ కూడా ఉంది...ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..గోరు వెచ్చటి నీటితోనే ఫేస్ వాష్ చేసుకోవాలి...చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటే అదే పనిగా తుమ్ములు వచ్చేస్తాయి.." అని చెప్పింది శ్రీలీల. "చిన్నప్పుడు నేను స్కూల్ టీచర్ కి లీవ్ లెటర్ రాసా. దాని తర్వాత చాలామంది చాలా రాసా..మీకు కూడా చాలామంది రాసుంటారు.

ఈరోజు మేము నిన్ను ప్రశ్నలడుగుతాం అన్న సందీప్, సుహాస్..ఇది ఆ షో కాదన్న ప్రదీప్

సర్కార్ సీజన్ 3 నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "కలర్ ఫోటో" టీమ్ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ సందీప్, హీరో సుహాస్, హీరోయిన్ చాందిని చౌదరి, సపోర్టింగ్ ఆర్టిస్ట్ దివ్య శ్రీపాద వచ్చారు. "అందరూ సిద్ధంగా ఉన్నారు కదా..ఇక మొదలు పెడదామా" అని ప్రదీప్ అడిగేసరికి "వన్ సెకండ్" అన్నారు సందీప్ రాజ్. "ఇది ఆ షో కాదు కదా" అన్నాడు ప్రదీప్ ఫన్నీగా.."ఎప్పుడూ మీరే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం అని చెప్పారు సందీప్.."వావ్ ప్రాసెస్ ఏంటి సర్...ఫస్ట్ క్వశ్చన్స్ మీరు అడుగుతారా ఆన్సర్స్ నేను చెప్పాలా" అనడంతో అందరూ నవ్వేశారు.."ఫస్ట్ క్వశ్చన్..ముళ్ళు దేనికి ఉంటాయి" అని సందీప్ అడగడంతో "ముళ్ళు మొక్కలకు ఉంటాయి" అని ఆన్సర్ చెప్పాడు ప్రదీప్ "రాంగ్ ఆన్సర్...గడియారానికి ముళ్ళు ఉంటాయి" అని చెప్పారు సందీప్..