English | Telugu

Krishna Mukunda Murari : ఆ మాటలు వినలేక ముకుంద ...మురారి గురించి భవాని ఆలోచిస్తూ టెన్షన్

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -483 లో.. కృష్ణకు జాగ్రత్తలు చెప్పిన భవాని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. తను కృష్ణలో టెన్షన్ మొదలవుతుంది. మురారీ నుంచి ఫోన్ రాకపోవడంతో కాస్త కంగారుపడుతుంటుంది. కాసేపటికి కృష్ణ వాళ్ళ ఇంటిముందు కారు ఆగుతుంది. మురారి అనుకున్న కృష్ణ సంబరంగా నవ్వుకుంటు అక్కడికి వచ్చేస్తుంది. అయితే ఆ కారులోంచి మురారీ కాకుండా ముకుంద దిగుతుంది. నవ్వుతూ దగ్గరకు వెళ్లి.. ఎలా ఉన్నావ్ కృష్ణా అని ముకుంద అంటుంది. నువ్వు ఎందుకొచ్చావని కృష్ణ కోపంగా అనగానే.. నీ కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే ప్రయాణం ఎలా జరగింది.. మంచినీళ్లో.. మజ్జిగో తాగుతావా అని అనడకుండా.. ఎందుకొచ్చావేంటని అడుగుతావేంటి కృష్ణ అని ముకుంద అంటుంది. మళ్లీ అడుగుతున్నాను.. 

Karthika Deepam2 : అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం...కావేరి గురించి తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -58 లో.....శ్రీధర్ వెళ్తుంటే దీప భర్త నర్సింహ రెండో పెళ్లి విషయం గురించి కూడా లాయర్ కి చెప్పమని పారిజాతం అంటుంది. మన టెన్షన్స్ మనకి ఉండగా.. ఎందుకు వాళ్ళ గురించి అని శ్రీధర్ అంటాడు. అలా అంటావేంటి? అలా భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవచ్చా అని పారిజాతం అనగానే.. ఈవిడ మళ్ళీ మొదలు పెట్టిందని శ్రీధర్ కంగారుగా వెళ్తాడు. ఎంటి అల్లుడు రెండో పెళ్లి అనగానే టెన్షన్ పడుతున్నాడు.. డౌట్ పడదామన్న కూడా అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం అనుకుంటుంది.

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలుసుకున్న పెద్దాయన.. ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -110 లో.. మీరు పిలవడం ఎందుకు అవమానించడం ఎందుకని ధన అంటాడు. బుద్ది లేక... అది లేకే నువ్వు ఈ ఇంటికి అల్లుడు అయ్యావని శ్రీలత అంటుంది. ఆ రామలక్ష్మితో దీపం వెలిగిస్తే నేను చచ్చినంత ఒట్టేనని సీతాకాంత్ కి శ్రీలత చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి శ్రీలత అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే ధన వస్తాడు. చూసావ్ కదా ఎలా మాట్లాడుతుందో.. పైకి మనతో ఎలా మాట్లాడుతుంది.. లోపల మనపై ఎంత కోపం ఉందో చూసావ్ కదా అని సీరియస్ అవుతాడు.

Guppedantha Manasu : డోర్ తెరిచి చూసేసరికి ఇద్దరి మధ్య గొడవ

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1088 లో.. నేను నీ అత్తయ్య కొడుకుని నువ్వు నాతో సరదాగా ఉండాలనుకుంటున్నావు.. ఉంటున్నావ్ అది అందరి జీవితంలో ఉంటాయి.. నా జీవితంలో కాదని మను అంటాడు. నీ జీవితంలో ఎందుకు ఉండవ్.. నువ్వు మనిషివి కదా.. నీలా ఎవరు ఉండరని ఏంజిల్ అంటుంది. అదే నేను చెప్తున్నాను.. ఇప్పుడు నా గురించి క్లారిటీ ఇస్తాను. అర్థం చేసుకో.. నేను ఎవరికి దగ్గరవుతానో వాళ్ళతో నాకు విపరీతమైన ఘర్షణ ఏర్పాడుతుంది. నాకు పర్మినెంట్ గా దూరం అవుతారని మను అనగానే.... అంటే నేను దూరం అయిపోతానని నువ్వు బయపడుతున్నావా.. బాధపడుతున్నావా అని ఏంజిల్ అంటుంది.

ఎక్స్ట్రా జబర్దస్త్‌ కంపెనీ క్లోజ్... రోడ్డున పడ్డ కమెడియన్స్!

2013 నుంచి జబర్దస్త్  2014 నుంచి  ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. అప్పట్లో గురు, శుక్రవారం వచ్చిదంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుని కమెడియన్స్ స్కిట్స్ కి  కడుపుబ్బా నవ్వుకునే వాళ్ళు. ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, ఆది  లాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్  ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ ఇచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు...సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోస్ గా, రైటర్స్ గా, డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు.

బుర్రకి దెబ్బ తగిలితే మెమరీ లాస్ అవుతుంది..కానీ లాంగ్వేజ్ ని ఎందుకు మర్చిపోరు

గుప్పెడంత మనసు సీరియల్ లో సాయికిరణ్ రోల్ అంటే చాలు చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. ఐతే ఈ సీరియల్ లో మహేంద్ర రోల్ అద్భుతంగా నటించాడు సాయి కిరణ్..అందులోనూ ముకేశ్ రిషికి తండ్రి పాత్రలో జీవించేసాడు. వీళ్ళిద్దరినీ చూస్తే తండ్రీ కొడుకులంటే నిజంలో కూడా ఇలానే ఉండాలి అనేంత ఆనందంగా కనిపిస్తారు. అలాంటి సాయికిరణ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా షూటింగ్ స్పాట్ లో చాయ్ తాగుతూ ఆరాంగా "మనిషి దెబ్బ తగిలి మెమరీ లాస్ ఐతే గనక అన్ని విషయాలు మర్చిపోతారు కానీ లాంగ్వేజ్ ని ఎందుకు మర్చిపోరు" అంటూ ఒక వెరైటీ ప్రశ్న వేసాడు. ఇక ఈ ప్రశ్న విన్న తర్వాత నెటిజన్స్ కూడా "అవునండి సేమ్ డౌట్ మాకు కూడా వచ్చింది.

ఎమోషనల్ పోస్ట్ చేసిన బిగ్ బాస్ రన్నర్!

బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని చాలా మందిని బిగ్ బాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కొంతమందికి బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ వల్ల పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లలో సయ్యద్ సోహెల్ ఒకడు. బిగ్ బాస్ ద్వారా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ గేమ్ షోలో తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో గతేడాది 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.