English | Telugu

నాకు కూడా అప్పట్లో ఒక బేబీ ఉంది

ఆహా వేదిక మీద సర్కార్ సీజన్ 3 ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసింది. దీనికి "బేబీ" మూవీ టీం వచ్చింది. ఇక ఈ స్టేజి మీదకు రాగానే స్టూడెంట్ ఆడియన్స్ ని చూసి చాలా ఖుషీ ఐపోయాడు హోస్ట్ ప్రదీప్. "మిమ్మల్ని చూడగానే నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను..నా కాలేజీ లైఫ్ కూడా గుర్తొస్తుంది..అని చెప్పాడు..కాలేజీ లైఫ్, ఫ్లాష్ బ్యాక్ అంటే చాలు అప్పట్లో జరిగిన ఎన్నో స్టోరీస్ కూడా గుర్తొస్తాయి కదా..మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అటెండెన్స్, మార్కులు కాకుండా..అప్పటి లవ్ స్టోరీస్, క్రష్ లు గుర్తొస్తూ ఉంటాయి. అందరి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటది కదా..మన లైఫ్ లో కూడా ఓ బేబీ ఉంటది కదా..నాకు ఆ రోజుల్లో ఒక బేబీ ఉంది.

మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది...

ఢీ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ ఐపోయింది. రాబోయే వారం నుంచి టీమ్స్ మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్టుగా ఉండబోతోంది అన్న విషయం ఈ ప్రోమో ద్వారా అర్ధమైపోతుంది. ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ సైరా రాయలసీమ టీమ్స్ మధ్య ముందుగా పోటీ మొదలయ్యింది. తర్వాత బెజవాడ టైగర్స్ వెర్సెస్ ఓరుగల్లు వీరులు టీమ్స్ మధ్య పోటీ కూడా అంతే రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి బాలయ్య గెటప్ లో వచ్చిన హైపర్ ఆది ఒక అట్రాక్షన్ ఐతే ..యుట్యూబ్ లో  ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఫేమస్ ఐన  సునయన ఈ స్టేజి మీదకు  ఎంట్రీ ఇచ్చి ఆ అట్రాక్షన్ కి కొంచెం కామెడీ ఎమోషన్ టచ్ ఇచ్చి  ఫన్ క్రియేట్ చేసింది.

 కరివేపాకు వెళ్లి పక్కన నుంచో... మీ అమ్మతో తిట్టిస్తావా...

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ ఏమో కానీ భాస్కర్ వాళ్ళ అమ్మ మాత్రం ఇమ్మానుయేల్ ని పట్టుకుని అందరి ముందు దుమ్ము దులిపేసింది. పటాస్ ప్రవీణ్ టీమ్ లో సత్తిపండు తన భార్యతో వచ్చి స్కిట్ చేసాడు. అది చూసిన రష్మీ వెంటనే మాట్లాడుతూ ఒక  సీనియర్ కపుల్ మన మధ్య ఉన్నారు అని భాస్కర్ వాళ్ళ అమ్మని నాన్నని చూపించింది. మీ పెళ్ళై ఎన్నేళ్లయింది అని అడిగేసరికి 1976 లో అయ్యింది అని చెప్పారు వాళ్ళు . "మీ ఇంట్లో వంటలో ఉప్పు తక్కువైతే ఎం చేస్తారు" అని అడిగేసరికి "ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుంటాం" అని చెప్పారు భాస్కర్ వాళ్ళ నాన్న. "ఎప్పుడైనా నాన్నని కొట్టావా" అని భాస్కర్ వాళ్ళ అమ్మని ఇమ్మానుయేల్ ని అడిగాడు " నేను ఎప్పుడూ కొట్టలేదు. రెండు రోజులు మాట్లాడను కానీ...కొట్టడం ఉండదు...మా ఆయన అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకు అంతే ఇష్టం..మా ఆయనకు 18 ఏళ్ళు నాకు 13  ఏళ్ళు..అప్పుడు పెళ్లి చేశారు..అప్పుడు అన్ని రకాల ఆటలు ఆడేదాన్ని.

కృష్ణని ప్రేమిస్తున్నాని మురారి చెప్పడంతో ఎమోషనల్ అయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -197 లో.. కృష్ణని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీసి కాపాడతాడు. కృష్ణని  మురారి ఎత్తుకొని వెళ్తుంటే.. సడన్ గా ముకుంద ఎదురుపడుతుంది. నువ్వు ఏంటి ఇక్కడ అని మురారి షాక్ అవుతాడు. రాను అనుకున్నావా? రాలేనని అనుకున్నావా  అని ముకుంద అంటుంది. ఎందుకు వచ్చావ్ అని మురారి అడుగుతాడు. "నువ్వు ఎక్కడ ఉంటే.. నేను అక్కడే" అని ముకుంద అంటుంది. సరే నీతో మాట్లాడాలి మళ్ళీ కలుస్తా అని మురారి వెళ్ళిపోతాడు. నీతో కూడా తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని ముకుంద అంటుంది.

సుమకి అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం అన్న బాలయ్య

బాలయ్య బాబు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఆయన ఆల్ రౌండర్..సరదాగా మాట్లాడతారు...ఫన్నీగా కౌంటర్ లు వేస్తారు. బాలయ్య అంటే వాట్ నాట్ అనిపించుకునేలా ఉంటుంది ఆయన ఆటిట్యూడ్. అలాంటి బాలయ్య యాంకర్ సుమ మీద సెటైర్లు పేల్చారు. ఆయన మాటలకు ఆమె అవాక్కయ్యింది. ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మైక్ తీసుకుని వేరే లెవెల్ లో మాట్లాడారు. ఆయన  మైక్ తీసుకునేసరికి  ఫ్యాన్స్ అంతా  ‘కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. ఆ మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.. తనను సెక్సీ అంటే సుమ, విమలా రామన్, మమతా మోహన్ దాస్ అందరూ జెలస్ ఫీలవుతారు అన్నారు నవ్వుతూ.

ఆంటీ అన్న అవినాష్...షాకైన శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ కలర్ ఫుల్ గా రాబోతోంది. హాట్ హాట్ గా ఉన్న అత్తలు..కూల్ గా ఉన్న సీరియల్ కోడళ్ళు వచ్చారు. శ్రీముఖి కూడా వాళ్ళతో కలిసి బాగా ఎంటర్టైన్ చేసింది. అవినాష్ కి ఫైమా భార్యగా నటించింది. శ్రీముఖిని చూసి ఎవరా ఆంటీ అని అడిగేసరికి శ్రీముఖి నోరెళ్లబెట్టింది. అవినాష్ పెదరాయుడు గెటప్ లో ఊళ్ళో సమస్యలు తీర్చడానికి వచ్చేసరికి వెనకాలే ఫైమా వచ్చి "ఇంట్లో సమస్యలు తీర్చలేవు గాని ఊళ్ళో సమస్యలు తీరుస్తావా..ఇంటికొచ్చి కూరలు కొయ్యి ముందు" అని అవినాష్ చెంపలు వాయగొట్టింది. జానకి కలగనలేదు...సీరియల్ నుంచి అత్త రాశి డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అవినాష్ తెగ పొగిడేసాడు..రాశిని అత్త అంటే ఊరుకోను అన్నాడు.

జంటల మధ్య మొదలైన మార్కుల యుద్ధం..సర్దిచెప్పిన రాధ, శ్రీముఖి

"నీతోనే డాన్స్" ఈ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే షో ప్రోమోలో జంటల మధ్య మార్క్స్ వార్ మొదలైపోయింది. ఈ రాబోయే వారం థీమ్ "డాన్సస్ ఆఫ్ ఇండియా" పేరుతో అందరూ రకరకాల డాన్స్ స్టైల్స్ తో, వాటికి సరిపోయే వెరైటీ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. ఐతే ఒక్కొక్కళ్ళ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా చేసారు. ఇక ఇక్కడినుంచే  వార్ మొదలయ్యింది..యాదమ్మ రాజు, స్టెల్లా చేసిన  డాన్స్ మీద అంజలి - పవన్ జంట కామెంట్ చేశారు. "అరే నెక్స్ట్ టైం మ్యాజిక్ తో పాటు ఇంకొంచెం డాన్స్ చేయండి..ప్రాపర్టీ తప్ప డాన్స్ కనిపించడం లేదు" అనేసరికి శ్రీముఖి ఆ రెండు జంటల మధ్య సర్ది చెప్పి కూల్ చేసింది.

నడవడానికి ఇంకో నెల టైం పడుతుంది...అందుకే ఇంట్లోంచి షార్ట్స్ చేస్తున్నాను

​రౌడీ రోహిణి బుల్లితెర మీద చాలా తక్కువ కాలంలో ఫేమస్ ఐన ఆర్టిస్ట్. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిపోయారు రోహిణి. రీసెంట్ గా  "సేవ్ ది టైగర్స్" అనే వెబ్ సిరీస్ లో రోహిణి కామెడీ రోల్ కి ఆడియన్స్ చాలామంది ఫాన్స్ ఇపోయారు. అలాంటి రోహిణి చాలా కాలం క్రితం ఒక  రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ టైములో ఆమె కాలికి తీవ్ర గాయమయ్యింది. దాంతో అప్పుడు ఆమె కుడి కాలులో ఒక రాడ్ వేశారు.

స్విమ్మింగ్ వచ్చని మురారికి అబద్ధం చెప్పిన కృష్ణ! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో.. ముకుంద ఉన్న గది ముందు చెప్పులు ఉండడంతో కృష్ణకి డౌట్ వస్తుంది. లోపల ఎవరో ఉన్నారని అదే విషయం భోజనం చెయ్యడానికి కూర్చున్న మురారిని కృష్ణ అడుగుతుంది. ఏసీపీ సర్ ఇక్కడ మనం కాకుండ ఎవరో ఉన్నారని అనగానే.. ముకుంద నే వచ్చి ఉంటుందని మురారి టెన్షన్ పడతాడు. కృష్ణ ని ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు మురారి. కృష్ణ మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరో ఉన్నారని అంటుంది. ఎవరు లేరు నువ్వు ముందు భోజనం చెయమని కృష్ణకి అన్నం తినిపిస్తాడు మురారి.