English | Telugu
జీబ్రా ఓటిటి వేదిక ఫిక్స్..డేట్ ఎప్పుడో తెలుసా
Updated : Dec 12, 2024
సత్యదేవ్(sathya dev)ప్రియాభవాని శంకర్(priya bhavani shankar)హీరో హీరోయిన్లుగా కన్నడ నటుడు ధనుంజయ్,సత్యరాజ్, అమృత అయ్యంగార్,సునీల్ ప్రధాన పాత్రలని పోషించిన చిత్రం 'జీబ్రా'.నవంబర్ 22 న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే రిసీవ్ చేసుకుంది.
ఇప్పుడు ఈ మూవీ త్వరలోనే ఓటిటి వేదికగా ప్రేక్షకులని కనువిందు చేయనుంది.ఈ మేరకు జీబ్రా ఓటిటి హక్కులని పొందిన 'ఆహా'(aha)యాజమాన్యం అధికారంగా వెల్లడి చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.అయితే ఏ డేట్ లో టెలికాస్ట్ అవుతుందనేది మాత్రం వెల్లడి చెయ్యడలేదు.త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ మీద ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న లోపాలకి,అండర్ కరెంట్ గా క్రైమ్ ని జోడించి తెరకెక్కించిన 'జీబ్రా'ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్,పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఎస్ఎన్ రెడ్డి,బాలసుందరం,దినేష్ సుందరం నిర్మించగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వాన్ని వహించాడు.కెజీ ఎఫ్ ఫేమ్ రవి బ్రసూర్ సంగీతాన్ని అందించాడు.