Read more!

English | Telugu

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో పొలిటికల్ మూవీ.. యమదొంగ, మగధీర కలిస్తే 'యమధీర'...

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం 'యమధీర'. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి చిత్రంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ చేతుల మీద జరగగా నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి. ఎస్. రావు, పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు గారు, మధుసూదన్ గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు నటించడం ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎం ల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్ కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. "యమధీర చాలా మంచి టైటిల్. ఇందాక ప్రసన్నకుమార్ గారు యముడు మీద వచ్చిన టైటిల్ చెప్తూ యముడికి మొగుడు టైటిల్ మర్చిపోయారు. యముడు టైటిల్స్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. వేదాల శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్ గా ఈ సినిమా నిర్మించారు. మంచి ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. మన తెలుగువారు నాగబాబు గారు, అలీ గారు లాంటివాళ్ళు నటించిన పదహారణాల తెలుగు సినిమా ఇది. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత డి. ఎస్. రావు మాట్లాడుతూ.. "యమధీర ఈనెల 23న విడుదల అవబోతోంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమాల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వేదాల శ్రీనివాస్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "శ్రీ మందిరం ప్రొటెక్షన్ పై వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా యమధీర సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇందాక ప్రసన్నకుమార్ గారు చెప్పినట్టు రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇది తెలుగుదనం ఉట్టిపడుతున్న సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రెసెంట్ ట్రెండుకు తగినట్టుగా ఎలక్షన్స్ గురించి వివరిస్తూ ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీనివాస రావు గారు విధ్వంసుడు. అన్నీ తెలిసి ఉండి ఇండస్ట్రీకి రావడం అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ మన ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన లాంటి వ్యక్తికి సక్సెస్ వస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలతో ఎన్నో కుటుంబాలు ఇండస్ట్రీలో నిలబడతాయి. ఈ సినిమాకి పెద్ద విజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. "నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన  టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారికి ట్రెజరర్ రామ సత్యనారాయణ గారికి డి. ఎస్. రావు గారికి పి. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ గారు క్రికెటర్ శ్రీశాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. అదేవిధంగా నాగబాబు గారు, అలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధుసూదన్ గారు నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

వరుణ్ ఉన్ని సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రోష్ మోహన్ కార్తీక్, ఎడిటర్ గా సి రవిచంద్రన్ వ్యవహరిస్తున్నారు.