Read more!

English | Telugu

'నాటు నాటు'ని మరచిపోయేలా చేయనున్న ఎన్టీఆర్!

'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి 'నాటు నాటు' పాటకి డాన్స్ వేస్తే, ప్రపంచవ్యాప్తంగా మోతమోగిపోయింది. అయితే బిగ్ స్క్రీన్ పై మరోసారి అలాంటి మ్యాజిక్ చూడబోతున్నాం. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చిందేయబోతున్నాడు.

'వార్ 2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ లో అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఉంటుందట. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్న పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఇరగదీయనున్నారట. 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్ తరహాలోనే ఇది కూడా థియేటర్లలో ఒక ఊపు ఊపేలా ఉంటుందట.

ఇండియన్ టాప్ స్టార్స్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్, హృతిక్ ముందు వరుసలో ఉంటారు. అలాంటిది ఈ ఇద్దరు స్టెప్పులేస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు.