English | Telugu
విక్రమార్కుడు హిందీలో అక్షయ్ కుమార్
Updated : May 18, 2011
"విక్రమార్కుడు" హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నారట. వివరాల్లోకి వెళితే రాజంవళి దర్శకత్వంలో, మాస్ రాజా రవితేజ "విక్రమ్ రాథోడ్" అనే పోలీసాఫీసర్ గా, "అత్తిలి సత్తిబాబు" అనే దొంగగా ద్విపాత్రాభినయంలో నటించగా నిర్మించబడిన సినిమా "విక్రమార్కుడు". "విక్రమార్కుడు" సినిమా తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే తమిళంలో కార్తీ హీరోగా, "సిరుత్తై" అనే పేరుతో విడుదలై, అక్కడ కూడా ఘనవిజయం సాధించింది.
దీంతో ఇప్పటికే "పోకిరి" సినిమాని "వాంటెడ్" గా, "గజిని" సినిమాని అదే పేరుతో రీమేక్ లు చేయటం మరిగి, తెలుగు సినిమాల మీద కన్నేసిన బాలీవుడ్ హీరోలు ఈ "విక్రమార్కుడు" మూవీని కూడా హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి అక్షయ్ కుమార్ ఈ "విక్రమార్కుడు" సినిమా రీమేక్ చేసే అవకాశాన్ని పొందాడు. "విక్రమార్కుడు" సినిమాని సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో, అక్షయ్ కుమార్ హీరోగా, సోనాలీ సిన్హా హీరోయిన్ గా హిందీలో "రౌడీ రాథోడ్"గా తెరకెక్కిస్తున్నారు.