English | Telugu

అరవింద్ స్వామిని హీరోగా చేసానని రెండు నెలలు పాటు ఏడుస్తు కూర్చున్నా 

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన ఇమేజ్ ని కలిగిన హీరోల్లో చియాన్ విక్రమ్(vikram)కూడా ఒకడు. వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడంతో పాటు క్యారక్టర్ కోసం ఎంత కష్టమైనా పడటం విక్రమ్ నైజం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న విక్రమ్ ఎవరకి తెలియని కొన్ని విషయాలు వెల్లడి చేసాడు. ఇప్పుడు అవి టాక్ అఫ్ ది డే గా నిలిచాయి.

దర్శకుడు మణిరత్నం(mani ratnam)అంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చెయ్యాలని, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినా పర్లేదని అనుకున్నాను.ఆయన మేకింగ్ స్టైల్ అంటే అంత ఇష్టం. ఈ క్రమంలోనే బొంబాయి(bombay)సినిమా ఆఫర్  వచ్చింది.హీరోగా నన్నే ఎంచుకున్నారు.కానీ ఫైనల్ ఎడిషన్ లో చేసిన చిన్న తప్పు వల్ల ఆ గొప్ప అవకాశం చేజారిపోయిందని చెప్పాడు. అంతే కాకుండా అందుకు గల కారణాలని కూడా పూస గుచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు. సడెన్ గా మణిరత్నం గారు  ఒక రోజు మరోసారి ఆడిషన్ కి పిలిచారు. వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తీసుకొచ్చి ఒక సీన్ గురించి వివరించి యాక్ట్ చెయ్యమన్నారు.దాంతో మాములు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చెయ్యమంటారేంటి, ఎందుకు చెయ్యాలని నాకనిపించింది. పైగా  స్టిల్ కెమెరా కావడంతో కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందనుకొని అలాగే సైలెంట్ గా ఉండిపోయాను.

దాంతో బొంబాయి మూవీ చేజారిపోయింది.ఆ విషయంలో దాదాపు రెండు నెలల వరకు బాధపడ్డాను.ప్రతి రోజు ఉదయం నిద్ర లేవడం, ఏడుస్తూ కూర్చోవడం ఇదే నా పని .ఆ తర్వాత అది పాన్ ఇండియా కల్ట్ మూవీ అయ్యిందని చెప్పుకొచ్చాడు. చియాన్ చెప్పుకొచ్చినట్టుగా బొంబాయి ఇండియా మొత్తం పెద్ద హిట్ అయ్యింది. 1995 మార్చిలో విడుదల అవ్వగా అ రవింద్ స్వామి(arvind swamy)మనీషా కొయిరాలా(manisha koirala)జంటగా చేసారు. అంతే కాదు అరవింద్ స్వామికి ఇదే ఫస్ట్ పిక్చర్. పైగా ఓవర్ నైట్ స్టార్ ని కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన చాలా  మంది  విక్రమ్ బాధపడటంలో తప్పు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ బాధ అయితే వర్ణనాతీతం. విక్రమ్ రీసెంట్ గా తంగలాన్ తో  చాలా రోజుల తర్వాత   విజయాన్ని అందుకున్నాడు.