Read more!

English | Telugu

తెలంగాణ ఫస్ట్ డిటెక్టివ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!


వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ చిత్రాలంటే దాదాపు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ ఎక్కువ కన్పిస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు వెబ్ సిరీస్ లు ఓటీటీలో హిట్ అవుతున్నాయి.

ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు‌. దానిని దృష్ణిలో ఉంచుకొని కొందరు దర్శక నిర్మాతలు సినిమాలని, వెబ్ సిరీస్ లని నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు. మరి అలాంటి వాటిల్లో ఈ మధ్య హిట్ అయినవి సేవ్ ది టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూసేలా చేశారు మేకర్స్. అలాగే ఇప్పుడు తెలంగాణ యాసతో తెలంగాణలో కొన్ని సంవత్సరాల క్రొతం జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఓ డిటెక్టివ్ వెబ్ సిరీస్  విడుదలకి రెడీ అయింది. మరి ఆ సిరీస్ ఏంటో ఓసారి చూసేద్దాం...

'వికటకవి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ వెబ్ సిరీస్ లో నగేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు ప్రదీప్ మద్దాలి దర్శకుడు.  రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇక ఈ సిరీస్ ని ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల చివర్లో గానీ మే మొదటి వారంలో గానీ ఈ సిరీస్ రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. మేఘా ఆకాశ్ లాంతరుతో, నరేశ్ అగస్త్య కాగడాతో దేనిగురించో వెతుక్కుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు. తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ డిటెక్టివ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.