Read more!

English | Telugu

అన్నయ్య మేము చెప్పినట్టు చెయ్యి.. నీకు ఎందుకు హిట్ రాదో చూస్తాం

అన్నయ్య మేము చెప్పినట్టు చెయ్యి.. నీకు ఎందుకు హిట్ రాదో చూస్తాం.  నీ రేంజ్ నీకు తెలియడం లేదు.మాకు తెలుసు నీ రేంజ్ ఏంటో.. ఇప్పుడు ఈ మాటలన్నీ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి  ఫ్యాన్స్  చెప్తున్నారు. వాళ్ళు అలా ఎందుకు అంటున్నారో,  అసలు  విషయం ఏంటో చూద్దాం.

విజయ్  గత కొంత కాలంగా వరుస ప్లాపులతో ఉన్నాడు. దీంతో  అభిమానులు ఎలాంటి క్యారెక్టర్లు ఎంచుకోవాలో సలహాలు ఇస్తున్నారు. అన్నయ్య నువ్వు సాఫ్ట్ రోల్స్ ని ఎంచుకుంటే  హిట్ రాదు. ఒక మంచి మాస్ సినిమా తీస్తేనే హిట్ వస్తుంది. మా మాట విని లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలని పక్కన పెట్టు.వెంటనే ఒక బిగ్ డైరెక్టర్ తో  మాస్ సినిమా స్టార్ట్ చెయ్యి అని  అంటున్నారు. ఫ్యాన్స్ ఈ విధంగా సలహాలు ఇవ్వడం చూస్తుంటే విజయ్ ని  వాళ్లు ఎంతగా అభిమానిస్తున్నారో అర్ధం అవుతుంది.

ఇక విజయ్ కెరీర్ ని ఒకసారి చూసుకుంటే  అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన  గీత గోవిందం తో అందరి అభిమాన కధానాయకుడు అయ్యాడు. ఆ మూవీ  2018 లో వచ్చింది. అప్పట్నుంచి విజయ్ కి విజయం అనేది దక్కలేదు. టాక్సీ వాలా మాత్రం ఒక మాదిరి విజయాన్ని దక్కించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన లైగర్, ఖుషి చిత్రాలు కూడా  పరాజయం పాలయ్యాయి. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అపజయాన్నే మూటగట్టుకుంది.ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది.