Read more!

English | Telugu

విజయ్ ఆంటోనీ కి భార్య వల్ల ఎన్ని ఇబ్బందులో..మే 10 న చెప్తాడు  

బిచ్చగాడు తో విజయ్ ఆంటోనీ  తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారాడు. కొన్ని నెలల క్రితం ఆయన కూతురు చనిపోయినప్పుడు కూడా అందరు  ఎంతగానో బాధపడ్డారు. అంతగా తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది 

విజయ్ ఆంటోనీ రీసెంట్ మూవీ లవ్ గురు. కామెడీ అండ్ రొమాన్స్  నేపథ్యంలో  తెరకెక్కింది. ఏప్రిల్ 11 న తమిళ, తెలుగు భాషల్లో  విడుదల అయ్యింది. కాకపోతే తమిళంలో మాత్రం రోమియో అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు చోట్ల కూడా మంచి విజయాన్నే  నమోదు చేసింది ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి అడుగుపెడుతుంది. పైగా తెలుగు తమిళంలో ఒకే సారి స్ట్రీమింగ్ కి రానుంది. మే 10 నుంచి తెలుగు వెర్షన్ ఆహా లో, తమిళ వెర్షన్  అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది  


మలేషియాలో ఏకాంత జీవితాన్ని గడిపే  అరవింద్ క్యారక్టర్ లో విజయ్ సూపర్ గా నటించాడు. నిజమైన ప్రేమను కనుక్కోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలో ఇష్టం లేకుండానే పెళ్లి  జరుగుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. వైఫ్ క్యారక్టర్ లో మృణాళిని  రవి నటించింది. వినాయక్ వైద్యనాధన్ దర్శకత్వం వహించగా భారత్ ధనశేఖర్ సంగీతాన్ని అందచేసాడు.విజయ్ ఆంటోనీ నే నిర్మాతగా వ్యవహరించాడు. యోగి బాబు, జైలర్ గణేష్,సుధ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు