Read more!

English | Telugu

హీరోలు నాతో నటించడానికి ఇష్టపడరు..నెపోటిజం అయితే లేదు 

ఆమె ఆషామాషి నటీ కాదు ఏడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకుంది. నేషనల్ అవార్డు ని గెలుచుకుంది.భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు ని కూడా పొందింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ  హీరోయిన్  విద్యాబాలన్. బాలీవుడ్ లో ఎన్నోసూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె  హీరోల గురించి  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి

 విద్యాబాలన్  తన సినీ కెరీర్ లో ఎక్కువ భాగం లేడీ  ఓరియెంటెడ్ సినిమాలే చేసింది. ఇప్పుడు వాటిని ఉదాహరిస్తునే  హీరోల మీద సెటైర్లు  వేసింది.  లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో మంచి సందేశం ఉంటుంది. ప్రేక్షకులు కూడా  వాటిని ఎక్కువ భాగం  ఆదరిస్తారు.కానీ  కొందరు హీరోలు మాత్రం  అది సహించలేరు. నేను ఎక్కువ భాగం అలాంటి సినిమాలు చేస్తాను కాబట్టి  నాతో నటించటానికి ఇష్టపడరు. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పుకొచ్చింది. అదే టైం లో బాలీవుడ్  గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా  చేసింది. ఇండస్ట్రీ లో బంధుప్రీతి ఉందంటే నేను అంగీకరించను. ఒక వేళ నెపోటిజం ఉండి ఉంటే తారల పిల్లలంతా సక్సెస్ అయ్యే వాళ్ళు. పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు. నేను కింది స్థాయి నుండి వచ్చే హీరోయిన్ గా నిలదొక్కుకున్నానని చెప్పింది. 

2003 లో  సినీ రంగ ప్రవేశం చేసిన విద్యా బాలన్ ఇప్పటి దాకా సుమారు 35 చిత్రాలకి పైగానే చేసింది. పరిణీత, లగేరహో మున్నాభాయ్, గురు, ఏకలవ్య, ఖోయ ఖోయ చంద్, భూల్ భూల్ గయ, బేగం జాన్, తుమ్హారీ సులు, పింక్ ,  ది డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో కూడా బాలకృష్ణ తో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్యార్, భూల్ భూలయ్యా 3 లో చేస్తుంది.