Read more!

English | Telugu

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. మధ్యలో వెంకీ మామ!

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'ఎఫ్-2', 'ఎఫ్-3' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా కామెడీ ఎంటర్టైనర్సే. థియేటర్లలో నవ్వులు పూయించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతోంది. ఈసారి క్రైమ్ ఎంటర్టైనర్ తో అలరించనున్నారు.

ఉగాది సందర్భంగా వెంకటేష్-రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా ప్రకటన వచ్చింది. అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇది "ఎక్స్ కాప్(పోలీస్), ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్" మధ్య జరిగే కథ అని వీడియోలో చూపించారు. అలాగే ఈసారి ఎక్స్‌ట్రార్డినరీ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, "సంక్రాంతికి విక్టరీ వినోదంతో కలుద్దాం" అంటూ ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.