English | Telugu
స్వీయ నియంత్రణ ఉంటే మంచిది..ఎన్టీఆర్ మొన్ననే నీ దర్శకత్వంలో చెయ్యాలని ఉందన్నాడు
Updated : Sep 24, 2024
ఇతర బాషా చిత్రానికి సంబంధించిన దర్శకులు అయినా కూడా, కొంత మంది దర్శకులకి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.అలాంటి వాళ్ళల్లో ఒకరు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్(vetrimaaran)ఆయన సినిమాల్లో కథే అతి పెద్ద స్టార్. 2007 లో ధనుష్(dhanush)హీరోగా వచ్చిన పొల్లవదన్ తో ప్రారంభమయ్యిన వెట్రిమారన్ సినీ ప్రస్థానం ఆడు కాలం, అసురన్,వడ చెన్నై, విడుదలై వంటి చిత్రాలతో అప్రహాతీతంగా కొనసాగుతూ వస్తుంది.రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)తన దేవర(devara)ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వెళ్ళినప్పుడు వెట్రిమారన్ దర్శకత్వంలో చెయ్యాలని ఉందని చెప్పాడంటే వెట్రి మారన్ దర్శకత్వ ప్రతిభని అర్ధం చేసుకోవచ్చు.
ఒక ఆంగ్ల సినీ మ్యాగజైన్ రీసెంట్ గా డైరెక్టర్స్ అన్ కట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. వెట్రిమారన్ తో పాటు పా రంజిత్, కరణ్ జోహార్, జోయా అక్తర్, మహేష్ నారాయణ వంటి దర్శకులు కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెట్రి మారన్ మాట్లాడుతు ఓటిటి సంస్థలు కొన్ని సినిమాలకు భారీ మొత్తంలో చెల్లించి హక్కులు కొనుగోలు చేయడం ద్వారా ఇండస్ట్రీ లో అసమతౌల్య పరిస్థితులకి కారణమవుతుంది. రజనీకాంత్(rajinikanth)విజయ్(vijay)వాటి స్టార్ హీరోల సినిమాలకి నూట ఇరవై కోట్లు అయినా ఇస్తాం. మీరు సినిమాని నిర్మించడని చెప్తున్నాయి.దీంతో హీరోల రెమ్యునరేషన్ పెరగడంతో పాటు బడ్జట్ కూడా పెరిగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే అది సరైనది కాదని ఓటిటి సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కానీ నిర్మాత అప్పటికే హీరోలతో అగ్రిమెంట్ చేయించుకొని ఉంటాడు.మరి ఓటిటి లు వెనక్కి తగ్గితే నిర్మాత ఏం చెయ్యాలని వెట్రిమారన్ ప్రశ్నిస్తున్నాడు.
అదే విధంగా ఏ దర్శకుడు అయినా కూడా థియేటర్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాని తెరెకెక్కించాలి.మంచి సినిమాలు తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్స్ కి వచ్చే చూస్తారు.సెన్సార్ షిప్ విషయంలో కూడా ఓటిటి సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని కూడా చెప్పుకొచ్చాడు.