English | Telugu
వేణు స్వామి కేసుపై హైకోర్టులో ముగిసిన వాదనలు..
Updated : Sep 19, 2024
జాతకాల పేరుతో సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడే వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy)పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత నెల హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.జె.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రసాదం రఘు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసుకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది జీవీఎల్ మూర్తి వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.