Read more!

English | Telugu

రవితేజ వీరకి యు/ఎ సర్టిఫికేట్

రవితేజ "వీర"కి యు/ఎ సర్టిఫికేట్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం" వీర". ఈ చిత్రంలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ అన్నీ కలగలసి ఉంటాయని తెలిసింది. రవితేజ "వీర" సినిమా కోసం ఈ సినిమా యూనిట్ మారిషస్, స్విట్జర్ ల్యాండ్ దేశాల్లో పాటలను చిత్రీకరించింది.

తమన్ సంగీతం అందించిన రవితేజ "వీర" సినిమా ఆడియోకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. రవితేజ "వీర" సినిమా ఇఓటీవల సెన్సారుకి వెళ్ళింది. రవితేజ "వీర" మూవీకి సెన్సారు వారు "యు/ఎ" సర్టిఫ్గికేట్‍ ను ఇచ్చారట. రవితేజ "వీర" హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తూండగా, కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టిగానూ, తాప్సి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ నటిస్తున్నారు. ఈ రవితేజ "వీర" సినిమా "మే" నెల 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.