Read more!

English | Telugu

రవితేజ వీర ఆడియో రిలీజ్ మే 4 న

రవితేజ "వీర" ఆడియో రిలీజ్ మే 4 తేదీన జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రం "వీర". ఈ చిత్రంలో కాజల్ కబడ్డీ చిట్టిగా అవుట్ అండ్ మాస్ పాత్రలో నటిస్తూండగా, తాప్సి ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తుండగా, రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. రవితేజ "వీర" ఆడియో రిలీజ్ మే 4 తేదీన ఘనంగా జరపటానికి ఈ చిత్ర నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ "వీర" చిత్రం యూరప్ లో చివరి షెడ్యూల్లో ఉంది. అక్కడ హీరో రవితేజ, హీరోయిన్ కాజల్ అఫగర్వాల్ పైన పాటలను చిత్రీకరిస్తున్నారు. మే 10 వ తేదీతో రవితేజ "వీర" చిత్రం షూటింగ్ పూర్తవుతుందనీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వెంటనే పూర్తవుతాయనీ తెలిసింది. తమన్ సాయి సంగీతం అందించిన రవితేజ "వీర" ఆడియోని మే 4 వ తేదీన రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని మే 19 న కానీ 20 వ తేదీన కానీ రిలీజ్ చేయ్యాలని ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారట.