Read more!

English | Telugu

బేబీ  వైష్ణవి చైత్యన్య కొత్త డేట్ చెప్పింది  

ఒక సినిమా  గురించి చెప్పుకోవాలంటే జనరల్ గా హీరో గురించి మొదలుపెడతాం. కానీ హీరోయిన్ ల గురించి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాదు కాదండోయ్ అలా చెప్పే పరిస్థితిని సదరు హీరోయినే కలిపిస్తుంది. అలాంటి హీరోయిన్లలో ఒకరు వైష్ణవి చైతన్య( vaishnavi chaitanya)బేబీ తో తను సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సొంతంగా ఫ్యాన్ బేస్ ని కూడా పొందింది. ఈ క్రమంలో తన అప్ కమింగ్ మూవీ అప్ డేట్ అభిమానుల్లో ఆనందాన్ని తెస్తుంది

వైష్ణవి చైతన్య న్యూ మూవీ లవ్ మీ (love me)రౌడీ బాయ్స్ ఫేమ్  ఆశిష్ హీరోగా చేస్తున్నాడు. ఏప్రిల్ 25 న రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు సరికొత్త డేట్ ని ఫిక్స్ చేసుకుంది.మే 25 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి ఆఫిషీయల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన  టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. మరి రేపు థియేటర్స్ లో మూవీ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి

లవ్ అండ్ హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో వస్తున్న లవ్ మీ ని దిల్ రాజు,హర్షిత్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని   పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.వీళ్లిద్దరు ఇండియన్ సినిమా గర్వించదగే టెక్నీషియన్స్ అనే విషయం అందరకి తెలిసిందే. అరుణ్ భీమవరపు రచనా దర్శకత్వంలో  తెరకెక్కింది.