English | Telugu
Vaazha Movie Review: వాజా మూవీ రివ్యూ
Updated : Sep 25, 2024
మూవీ : వాజా
నటీనటులు: సిజు సన్నీ, జామన్ జోతిర్, అమిత్ మోహన్, సఫ్ బోయ్, అనురాజ్, బసిల్ జోసెఫ్
ఎడిటింగ్: కణ్ణన్ మోహన్
మ్యూజిక్: రజత్ ప్రకాశ్
సినిమాటోగ్రఫీ: అరవింద్
నిర్మాతలు: విపిన్ దాస్
దర్శకత్వం: ఆనంద్ మీనన్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
విష్ణు, అజూ థామస్, మూసా.. ముగ్గురూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వాళ్లు కాలేజ్ స్థాయికి దగ్గరవుతుండగా, కలామ్, వివేక్ ఆనంద్ తో పరిచయమవుతుంది. అప్పటి నుంచి ఐదుగురు ఒక జట్టు అవుతారు. అందరు మధ్య తరగతి కుటుంబానికి చెందినవారే. అయిన ఎలాంటి బరువు బాధ్యతలు పట్టకుండా జీవితాన్ని చాలా సరదాగా గడిపేస్తుంటారు. ఈ ఐదుగురు ఒకే కాలేజ్ లో చేరితే చదవరని భావించిన పేరెంట్స్, వేరు వేరు కాలేజ్ లలో తమ పిల్లలను చేర్పించాలని భావిస్తారు. అయితే విష్ణు ఏ కాలేజ్ లో చేరాడో తెలుసుకుని మిగతా వాళ్లంతా కలిసి అదే కాలేజ్ లో చేరిపోవడంతో పేరెంట్స్ షాక్ అవుతారు. ఇక కొన్నిరోజులకి మాయ అనే అమ్మాయితో అజూ, రీతూ అనే అమ్మాయితో విష్ణు లవ్ లో పడతారు. అయితే ప్రేమ విషయంలో చేదు అనుభవాలే ఎదురైనా, ప్రేమ కంటే స్నేహమే గొప్పదనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ ఐదుగురు స్నేహితులు డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. తమ పిల్లలు తమని ఆ స్థాయి వరకు తీసుకుని రావడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతారు. ఇక వాళ్లు తనని క్షమించరని భావించిన విష్ణు, తమ ఇంటిపై నుంచి దూకేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విష్ణు చేసిన పని మిగతావారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? పేరెంట్స్ కలను వాళ్లు నిజం చేయగలిగారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
వాజా అంటే అరటిచెట్టు అని అర్థం. ఈ సినిమాకి ఈ చెట్టుకి మధ్యగల కథేంటంటే.. అరటి చెట్టు చాలా లేట్ గా లేజీగా పెరిగే చెట్టు. అదే ఇప్పుడు కాలేజీ కుర్రాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అంటే కాలేజీలో చేరగానే రెబల్స్ లాగా మారి , ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలని, కాలేజ్ బంక్ కొట్టాలని, సరదగా గడాపాలని భావించే స్టుడెంట్స్ కథే ఈ మూవీ. దీనిని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు ఆనంద్ మీనన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఈ మూవీ మలయాళంలో రిలీజై ఇపుడు తెలుగు వర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇక సినిమా చాలా సింపుల్ .. ఇదే కథతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే దర్శకుడు కథని రాసుకున్న తీరు, గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే అలా చివరి వరకు చూడాలనిపించేలా ఉంటుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఫస్టాఫ్ లో కుర్రాళ్ళు ఓ అడల్ట్ మూవీ క్యాసెట్ తెచ్చుకొని చూస్తారు. అక్కడ బిజిఎమ్ అండ్ ఆ ఒక్క సీన్ తప్ప మిగతాదంత అలా వెళ్ళిపోతుంది. ఈ సినిమా చివరి నలభై నిమిషాలు కచ్చితంగా ప్రతీ ఒక్కరు తమ పేరెంట్స్ కి చూపించాలనే ఆలోచనకి వస్తారు. ముఖ్యంగా యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.
సెకెంఢాఫ్ లో వచ్చే కొన్ని డైలాగ్స్ సినిమాకి ప్రదాన బలంగా నిలిచాయి. "ఒకరు హీరో అయ్యేది.. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నప్పుడో, డాక్టరో, లాయరో, కలెక్టరో అయినప్పుడు కాదు.. అది మిమ్మల్ని మీ నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు" అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. కథ ఎలా ఉంటుందంటే మనకో మన ఫ్రెండ్స్ కో జరిగినట్టుగానే ఉందే అని అనిపిస్తుంది ఇదే మూవీకి పెద్ద ప్లస్.
చివరి అరగంటలో కొడుకు కోసం తండ్రి పడే బాధ.. చాలా యునిక్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ గా అనిపిస్తూ ప్రతీ ఒక్కరిని కట్టిపడేస్తుంది. ఫస్టాఫ్ లో స్లూల్, కాలేజీ లైఫ్ లో సాగే కామెడీ బాగుంటుంది. ఇందులోని కొన్ని జోక్స్ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ గా త్వరలోనే మన ముందుకు వచ్చేస్తాయి. అంతలా కామెడీకి ఆ జోక్స్ కి మనం కనెక్ట్ అవుతాం. ఇది తీయాలంటే ఓ మూడు గంటలో లేక ఓ ఆరు ఎపిసోడ్ లు, ఎనిమిది ఎపిసోడ్ లు గల వెబ్ సిరీస్ గా తీయొచ్చు కానీ రెండు గంటల్లోనే లైఫ్ లోని అన్ని ఫేజెస్ ని తెరపై ప్రెజెంట్ చేశారు మేకర్స్. అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. రజత్ ప్రకాశ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సాంగ్స్ వింటుంటే మలయాళం నుండి తెలుగులోకి భళే మార్చేశారే అనిపిస్తుంది. కణ్ణన్ మోహన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
విష్ణుగా అమిత్ మోహన్, అజూ థామస్ గా సిజు సన్నీ, మూసాగా జోమన్, కలామ్ గా అనురాజ్, వివేక్ ఆనంద్ గా అర్షిద్ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : డీసెంట్ మూవీ విత్ ఫన్ అండ్ ఎమోషనల్ వ్యాల్యూస్. ఫ్యామిలీతో కలిసి యూత్ చూసే మూవీ ఇది.
రేటింగ్ : 3/5
✍️. దాసరి మల్లేశ్