Read more!

English | Telugu

చిరంజీవి భార్య మీద అంజనమ్మకి  ఫిర్యాదు..వీడియో రిలీజ్ చేసిన ఉపాసన 

ఉపాసన కొణిదెల..మెగాస్టార్ చిరంజీవి కోడలు..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య. ఈ టాగ్ లైన్స్ మాత్రమే కాకుండా  తన కంటు సొంత ఐడెంటీ కూడా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోను ఎప్పుడు  ముందుండి దటీజ్ మెగా కోడలని  అనిపించుకుంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో తెలుగు నాట ట్రెండింగ్ లో ఉంది.

ఉపాసన  అత్తమ్మాస్ కిచెన్ ని  ప్రారంభించిన విషయం అందరకి తెలిసిందే. రకరకాల పచ్చళ్ళు, పొడులు, పులిహార లాంటివి అత్తమ్మాస్ కిచెన్ బ్రాండ్ ద్వారా మర్కెట్ లో లభ్యమవుతున్నాయి. చిరంజీవి తల్లి అంజనమ్మ, భార్య సురేఖ ల పర్యవేక్షణలో అవి తయారు అవుతున్నాయి. ఆ ఇద్దరు దగ్గరుండి మరి  తయారు చేస్తున్నారు. ఇక ఉపాసన అప్పుడప్పుడు   అత్తమ్మాస్ కిచెన్ వీడియోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటిల్లో సురేఖ, అంజనమ్మలతో ఆమె చేసే ముచ్చట్లు చాలా  ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక వీడియోని రిలీజ్ చేసింది. చిరు తల్లి అంజనమ్మని ఉద్దేశించి నాయనమ్మ ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నారని  అడిగింది. సీరియస్‌గా ఏం లేను కాకపోతే  పని లేక ఖాళీగా కూర్చున్నా అంటు అంజనమ్మ కౌంటర్ వేసింది. మీ కోడలు పికెల్ బాగా చేయడం లేదా అని సురేఖ మీద కంప్లైంట్ చేసినట్టుగా కూడా  అంది. నువ్వూ కోడలివేగా అని మళ్లీ సెటైర్ లాంటిది వేసింది

ఆ తరువాత  సురేఖ దగ్గరకి వెళ్లి  అత్తమ్మా  క్యా హో రహా అని అంది. సురేఖ  సమాధానం చెప్పకుండా తన పనిలో తాను ఉంది.  కానీ అంజనమ్మ మాత్రం మళ్ళీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. హిందీలో అడిగితే  సమాధానం చెప్పలేదన్నట్టుగా అంది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఇక  ఇప్పుడు చాలా మంది అత్తమ్మాస్ కిచెన్ రెసిపీస్ ని టేస్ట్ చేస్తున్నారు. మంచి రుచిగా ఉన్నాయని కూడా అంటున్నారు.