Read more!

English | Telugu

ఆ మగాళ్లు సెక్సీగా ఉంటారంటున్న త్రిష..!

త్రిషాకృష్ణన్..ఒకప్పుడు సౌత్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్. దక్షిణాదిన అందరు టాప్ హీరోల పక్కన నటించి నంబర్‌వన్‌గా వెలుగొందింది. ఇప్పుడు కొత్త హీరోయిన్ల దాటికి ఫేడవుట్ అయ్యే స్థితిలో ఆమెకు ఛాన్స్‌లు అంతగా రావడం లేదు. ప్రజంట్ నాయకి అనే లేడి ఓరియెంటేడ్ మూవీ చేస్తున్న త్రిష మరిన్ని ఆఫర్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. త్రిష గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి, తన ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. మ్యారేజ్ క్యాన్సిల్ అవడంతోనే తనకు మళ్లీ సుడి తిరిగింది. తెలుగు, తమిళ భాషాల్లో వరుస అవకాశాలొచ్చాయి. కెరిర్‌, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి తాను తెలుసుకున్న విషయాల నుంచి మగాళ్లపై రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్‌లో నుంచి మగాళ్లు ఇలా ఉంటేనే నచ్చుతారని పెద్ద లెక్చర్ ఇచ్చింది.

*డేటింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు..అమ్మాయి అబ్బాయి సహజంగా కలిసి నడిస్తేనే బాగుంటుంది.ప్లాన్ చేసుకుంటే అది కృత్రిమంగా ఉంటుందని చెప్పుకొచ్చిందట

* ఒకసారి మా క్లాస్‌మేట్ ఓ అబ్బాయి ఇంటికి వెళ్లాను, తను నా కోసం చాలా కష్టపడి వంట చేశాడు. అయితే ఏం వండాడో సరిగ్గా గుర్తులేదు కానీ, నా దృష్టిలో వంట చేసే మగాళ్లు చాలా సెక్సీగా ఉంటారు.

* అమ్మాయిల ఇష్టాఇష్టాలు గౌరవించి..ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారిని మగువలు గుండెల్లో పెట్టుకుంటారు.