Read more!

English | Telugu

యోగా నా అందానికి రక్షణ-త్రిష

"యోగా నా అందానికి రక్షణ" అని ప్రముఖ హీరోయిన్ త్రిష అంటూంది. తన జన్మదినం సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రముఖ అందాల తార త్రిష తన అందం యొక్క రహస్యాన్ని తన జన్మదినం సందర్భంగా ప్రేక్షకులకు తెలియజేసింది. తన అందం యొక్క రహస్యం తాను నిరంతరం యోగా చేస్తూండటమేనని అందాల త్రిష అన్నారు. యోగా వల్ల బరువుతగ్గుతారని మనం విని ఉన్నాం.

కానీ త్రిష మాటల్లో అయితే యోగా వల్ల ఒక్క బరువు తగ్గటమే కాదనీ, మనసు ప్రశాంతంగా ఉండి, ముఖ్యంగా మన మనసు మన అదుపులో ఉంటుందనీ, అందువల్ల ముఖం కాంతివమతంగా మారుతుందనీ, యోగావల్ల మనసు మీద నియంత్రణ సాధించవచ్చనీ త్రిష అంటోంది. అలా మానసిక ప్రశాంతత సాధించటం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామనీ అందువల్ల మన జీవితం కూడా మనం కోరుకున్నట్లుగా ఉంటుందనీ త్రిష అన్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన ఒక చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూంది. త్రిషకు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.