English | Telugu

జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు

టాలీవుడ్ 2013 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మరోసారి హాల్ చల్ చేస్తున్నాయి. ప్రతీ సంవత్సరం అందజేసే జాతీయ అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది కూడా జరగబోతుంది. ఇందుకుగాను తెలుగు నుంచి మొత్తం 20 సినిమాలు పోటీ పడుతున్నాయి.

ఇందులో 1. అత్తారింటికి దారేది, 2. అంతకుముందు ఆ తర్వాత, 3. మిర్చి, 4. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, 5. బసంతి, 6.కమలతో నా ప్రయాణం, 7. మిణుగురులు, 8. సాహసం, 9. నా బంగారు తల్లి, 10. ఓ మల్లి, 11. ప్రణయవీధుల్లో పోరాడే ప్రిన్స్, 12. ప్రేమకథాచిత్రమ్, 13. అమ్మానీకు వందనం,14. అద్భుతసినీ ప్రపంచం, 15. శ్రీ జగద్దురు ఆదిశంకరాచార్య, 16. స్వామి వివేకానంద, 17. ది క్లూ, 18. ఉయ్యాలా జంపాలా, 19. యుగ్మలి, 20.పరంపర. మరి ఏయే సినిమాలకు అవార్డులు దక్కనున్నాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.