Read more!

English | Telugu

టిల్లు స్క్వేర్ ఓటిటి డేట్ ఫిక్స్ ..అట్లుంటది మరి 

ఉగాది, రంజాన్, శ్రీ రామనవమి పండగలు అప్పుడే అయిపోయాయని డల్ గా ఉన్నారా! ఈ నెలలో ఇంకో పండుగ  కూడా ఉంది.మాకు తెలియని ఫెస్టివల్ ఏముందని అనుకుంటున్నారా!  సరే  ఫెస్టివల్ డేట్ కూడా చెప్తున్నాను. ఈ నెల  ఇరవై ఆరు. ఆ డేట్ లో ఏం లేదుగా  అనుకుంటున్నారా!  ఖచ్చితంగా ఉంది.  ఇప్పడు నేను చెప్పబోయే విషయం వింటే అవును అని మీరు అంటారు 

ఏప్రిల్ 26 న టిల్లు స్క్వేర్ (Tillu square) ఓటిటి లోకి  ల్యాండ్ అవ్వనుంది. తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని  ఓటిటి పార్టనర్ అయిన  నెట్ ఫ్లిక్స్  సోషల్ మీడియాలో అధికారంగా వెల్లడించింది. పైగా అదిరిపోయే  క్యాప్షన్ ఒక దాన్ని పోస్ట్ చేసింది. హిస్టరీ రిపీట్ కావడం కామన్. అదే టిల్లు వస్తే హిస్టరీ తో పాటు మిస్టరీ, కెమిస్ట్రీ అన్ని రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్న తోని అని పోస్ట్ చేసింది. ఇప్పుడు అది అందరిని ఆకట్టుకుంటుంది.ఇక ఎప్పటినుంచో ఓటిటి ప్రేమికులు టిల్లు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త వాళ్లలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది

మార్చి 29 న  థియేటర్స్ లోకి అడుగుపెట్టిన  టిల్లు స్క్వేర్  విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని నమోదు చేసింది. సిద్దు జొన్నలగడ్డ( siddu jonnalagadda)టిల్లు గా మరో సారి తనదైన నటనతో ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు.హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్, సిద్దు ల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. 2022 లో వచ్చిన డిజె టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్  తెరకెక్కింది.అలాగే మొదటి భాగంలో టిల్లు ని ముప్పతిప్పలు పెట్టిన నేహా శెట్టి  కూడా టిల్లు స్క్వేర్ లో కాసేపు మెరిసింది. సితార ఎంటర్ టైన్మెంట్ అండ్ ఫార్చ్యూన్  ఫోర్  బ్యానర్స్  పై నాగవంశీ, సౌజన్య లు నిర్మించారు.మల్లిక్ రామ్ దర్శకుడు.  125 కోట్ల కలెక్షన్స్ కి పైగా టిల్లు సాధించింది.