Read more!

English | Telugu

‘టిల్లు స్క్వేర్‌’ : సెన్సార్‌ నిర్ణయంతో యూత్‌కి నిరాశ తప్పదా?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ‘డిజె టిల్లు’ యూత్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించి ‘టిల్లు స్క్వేర్‌’ యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసింది. దానికి కారణం అనుపమ పరమేశ్వరన్‌. ‘రౌడీబాయ్స్‌’ చిత్రం ముందు వరకు ఒక పద్ధతిగల హీరోయిన్‌గా కనిపించిన అనుపమ ఆ సినిమాలో లెక్కకు మించిన లిప్‌లాక్‌లతో రెచ్చిపోయి నటించింది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో ఆ డోస్‌ను మరింత పెంచింది. సినిమాలో చాలా హాట్‌ సీన్స్‌ ఉన్నట్టు ట్రైలర్‌లో రివీల్‌ చేశారు. దీంతో ట్రైలర్‌కు లెక్కకు మించిన వ్యూస్‌ లభించాయి. ఈ సినిమా మార్చి 29న రిలీజ్‌ కాబోతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని యూత్‌ ఆడియన్స్‌ ఉవ్విళ్ళూరుతున్నారు. 

‘టిల్లు స్క్వేర్‌’కి శుక్రవారం సెన్సార్‌ పూర్తయింది. సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. ట్రైలర్‌లోనే బోలెడన్ని హాట్‌ సీన్స్‌ కనిపించాయి. మరి సినిమాలో ఇంకెన్ని ఉంటాయోనని ఎంతో ఆశగా ఉన్నారు ఆడియన్స్‌. అయితే ఇప్పుడు సెన్సార్‌ వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ చూసి అంతా నీరుగారిపోతున్నారు. ఎందుకంటే ఒకటి, రెండు లిప్‌లాక్‌లు ఉంటేనే ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇస్తారు. అలాంటిది ఇందులో డీప్‌ లిప్‌లాక్‌లు ఉన్నాయి, రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇది డెఫినెట్‌గా ఎడల్ట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాయే అని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. సెన్సార్‌ యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చిందంటే అది ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా చూసే విధంగా ఉంటుందనేగా అర్థం. దీన్నిబట్టి సినిమాలో యూత్‌కి కనెక్ట్‌ అయిన కంటెంట్‌ మొత్తం ఎత్తేశారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. సెన్సార్‌ వారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూత్‌ ఆడియన్స్‌కి నిరాశ తప్పేట్టు లేదు.