English | Telugu

గెస్ట్‌ హౌస్‌కి రాకపోతే నీ ఫోటోలు, వీడియోలు.... చాందిని చౌదరికి బెదిరింపు!

షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించిన చాందిని.. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, కేటుగాడు, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. కుందనపుబొమ్మ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై కలర్‌ఫోటో, గామీ, యేవమ్‌, మ్యూజిక్‌ షాప్‌ మూర్తి వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

చాందినికి ఒకసారి ఓ వింత అనుభవం ఎదురైంది. ఒక కొత్త నెంబర్‌ నుంచి బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. ‘నువ్వు గెస్ట్‌ హౌస్‌కి రావాలి. లేకుంటే నీ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేస్తా’ అని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి ఎంతో టెన్షన్‌ పడిపోయిన చాందిని తెగ ఏడ్చిందట. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. టాలీవుడ్‌లో టామ్‌ బాయ్‌గా చెప్పుకునే స్నిగ్ధ.. సరదాగా చాందినిని ఆట పట్టించడానికి అలా మెసేజ్‌ చేసింది. ‘మీరెప్పుడైనా దూల పని చేశారా?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ స్టోరీ చెప్పుకొచ్చింది స్నిగ్ధ. అయితే తర్వాత తనే సరదాగా అలా మెసేజ్‌ చేసానని చాందినికి చెప్పిందట. అది విన్న చాందిని ‘ఎక్కడున్నావ్‌’ అని అడిగింది. తను ఉన్న ప్లేస్‌ చెప్పింది స్నిగ్ధ. వెంటనే అక్కడికి వెళ్లిన చాందిని.. ఆమె చెంప ఛెళ్లుమనిపించింది. స్నిగ్ధ సరదాగా ఆ మెసేజ్‌ చేసినప్పటికీ చాందిని ఎంత టెన్షన్‌ ఫీల్‌ అయి ఉంటుందో ఆమె రియాక్షన్‌ చూస్తే తెలుస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.