Read more!

English | Telugu

ఈ వారం చిన్న సినిమాలదే హవా.. అర డజను సినిమాల్లో ఆడియన్స్ ఓటు దేనికో!

ఈ సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాల తాకిడి. దీంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వారం అయితే మొత్తం చిన్న సినిమాలదే హవా. ఈ శుక్రవారం అర డజను చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి.

సత్యం రాజేష్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'టెనెంట్' ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు 'పారిజాత పర్వం', 'మార్కెట్ మహాలక్ష్మి', 'తెప్ప సముద్రం', 'శరపంజరం', 'మారణాయుధం' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఈ వారం రీ రిలీజ్ ల హడావుడి కూడా ఉంది. ఏప్రిల్ 19న 'హ్యాపీ డేస్', ఏప్రిల్ 20న 'జెర్సీ' రీరిలీజ్ అవుతున్నాయి.

అలాగే ఈ వారం ఓటీటీలో కూడా సినిమాలు, సిరీస్ ల సందడి బాగానే ఉంది.

ఆహా :
మై డియర్‌ దొంగ (తెలుగు) - ఏప్రిల్‌ 19 

డిస్నీ+ హాట్‌స్టార్‌ :
సైరన్‌ (తెలుగు) - ఏప్రిల్‌ 19 
చీఫ్‌ డిటెక్టివ్‌ 1958 (కొరియన్‌) - ఏప్రిల్‌ 19

నెట్‌ఫ్లిక్స్:
రెబల్‌ మూన్‌ 2 (హాలీవుడ్‌) - ఏప్రిల్‌ 19