Read more!

English | Telugu

‘ఆడు జీవితం’  మూవీ రివ్యూ

సినిమా పేరు: ఆడు జీవితం (ది గోట్ లైఫ్) 
తారాగణం: పృథ్వీ రాజ్ సుకుమారన్,  అమలాపాల్, జిమ్మీ జీన్ లోయిస్, రిక్ అబే తదితరులు 
రచన, దర్శకత్వం : బ్లెస్సి 
సంగీతం : ఏ ఆర్ రెహమాన్ 
నిర్మాతలు :  బ్లెస్సి , జిమ్మీ, స్టీవెన్, అబ్రహం
బ్యానర్: విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అల్టా గ్లోబల్ మీడియా  
విడుదల తేదీ:  మార్చి  28  2024 

 

కథ
మహమ్మద్ నజీబ్ ( పృథ్వీ రాజ్ సుకుమారన్) తెలంగాణాలోని ఒక  విలేజ్ కి చెందిన వ్యక్తి. తన భార్య సైనా (అమలాపాల్ )  తన తల్లి లోకంగా జీవిస్తు ఉంటాడు. నీటి అడుగుభాగాన ఉండే మట్టిని వెలికి తీసే పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తు ఉంటాడు.ఒక రోజు  తన స్నేహితుడు  అరబ్ కంట్రీ వెళ్లి డబ్బు బాగా సంపాదించవచ్చని నజీబ్ కి  సలహా ఇస్తాడు. దీంతో  తన కుటుంబం గొప్పగా ఉండాలని భావించి  అక్కడి వెళ్లాలని నజీబ్  నిశ్చయించుకుంటాడు. మరి అరబ్ కంట్రీ కి వెళ్లిన అతని కోరిక నెరవేరిందా? లేక  ఇబ్బందులు ఏమైనా ఎదుర్కున్నాడా? ఒక వేళ ఎదుర్కుంటే వాటినుంచి ఎలా బయటపడ్డాడు  అనేదే ఈ చిత్ర కథ.

ఎనాలసిస్

సాధారణంగా ఏ సినిమాకి  అయినా  కథ ముందుగా రివీల్ అవ్వదు. కానీ ఆడు జీవితం కథ అందరకి తెలిసిందే. ఎందుకంటే కేరళకు చెందిన వలస కూలీ నజీబ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనే సినిమాగా వచ్చింది.ది గోట్ లైఫ్ అనే నవల కూడా ప్రచురితమయ్యింది. కాబట్టి సినిమా ఎలా ఉంది అనే కంటే సినిమా ఎలా తీశారు అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ లో పృథ్వీ రాజ్ ఎడారి పరిస్థితులకి అలవాటు పడటం అనేది చాలా చక్కగా చూపించారు. అక్కడ ఉన్న ఒంటెలు గొర్రెలని మేపడానికి కూడా అనుభవం ఉండాలనేది చెప్పటం బాగుంది. మధ్య మధ్య లో కడుపుతో ఉన్న తన భార్యని గుర్తుచేసుకునే సీన్స్ కూడా బాగా పండాయి. ఇక సెకండ్ ఆఫ్ మొత్తం పృథి రాజ్ ఇంకో ఇద్దరు కలిసి తప్పించుకోవడం పైనే నడిచింది. ఎడారి తుఫాన్  సీన్స్  గాని ఎడారి పాముల సీన్స్ గాని చాలా బాగున్నాయి. కాకపోతే పృథ్వీ కి సహాయపడే  క్యారక్టర్ చివరకి  ఏమైందని మాత్రం చూపించలేదు   
 
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

పృథి రాజ్ సుకుమారన్ నటించిన తీరుకి ముందుగా హాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నజీబ్ క్యారక్టర్ లో ఆయన నటించిన విధానం ఎంతో మంది నటులకి ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యంగా తన కళ్ళ ద్వారానే నటన మొత్తం పండించాడు.సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల కళ్ళకి పృథ్వీ కనపడడు. కేవలం నజీబ్ మాత్రమే కనపడతాడు. అలాగే 31 కిలోల బరువు తగ్గినప్పుడు కూడా తన నటన ద్వారా ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడు. ఇక అమలాపాల్ కొన్ని సీన్స్ కే పరిమితమైనా ఉన్నంతలో చక్కగానే చేసింది.  పృథ్వీ లాగే మోసపోయిన క్యారక్టర్ ని పోషించిన ఆర్టిస్ట్  కూడా సూపర్ గా చేసాడు.ఇక  పృథ్వీ కి సహాయపడే ఇబ్రహీం క్యారక్టర్ లో ఫారెన్ యాక్టర్ జిమ్మీ కూడా ఒక లెవల్లో  నటించాడు. . మిగతా చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు కూడా బాగా చేసారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ లో ప్రత్యేకించి మెరుపులు ఏమి లేవు. ఆర్ ఆర్ కూడా నార్మల్ గానే ఉంది.ఇక డైరెక్షన్ అండ్ టీం పడిన కష్టం అంతా స్క్రీన్ మీద కనపడుతుంది. గోట్ లైఫ్ కోసం పదహారు  సంవత్సరాలు కష్టపడ్డానని డైరెక్టర్ చెప్పడం అక్షర సత్యం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ మాట ఒప్పుకుంటారు.ఇక కెమెరా పనితనం కూడా సూపర్ గా ఉంది. ఆ కష్టం అంతా స్క్రీన్ పై కనపడుతుంది. 

ఫైనల్ గా చెప్పాలంటే..

సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక సినిమా కోసం  ఇంతగా కష్టపడతారా అని ప్రతి ఫ్రేమ్ లో మనకి అనిపిస్తుంది. సినిమా అయితే నాట్ బాడ్. మరి ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అనేది కాలమే నిర్ణయిస్తుంది.  చివరలో కథ మొత్తానికి సంబంధించి ఒక భారీ ట్విస్ట్  ఉంటుంది. అది సినిమా చూసి తెలుసుకోండి.

రేటింగ్ : 3/5

- అరుణాచలం