Read more!

English | Telugu

చియాన్ విక్రమ్  బంగారు కుమారుడికి మండుతున్న నివాళి..పట్టుకోండి  

యమదొంగ మూవీలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు.ఎనీ డౌట్స్ అని. ఇప్పుడు ఈ డైలాగ్ విక్రమ్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది.విక్రమ్ (vikram)అంటే ఎవరని అనుకుంటున్నారా! అదేనండి మన చియాన్ విక్రమ్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే నటుడు చియాన్ మాత్రమే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.నటన తన ఊపిరి. అందుకోసం ఎంత  కష్టమైనా పడతాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తాజాగా చియాన్ వీడియో ఒకటి యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

నిన్న చియాన్ బర్త్ డే. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ తంగలాన్ (thangalan)నుంచి ఒక వీడియో విడుదల అయ్యింది. సుమారు 50 సెకన్లు పాటు ఉన్న ఆ వీడియో  చూస్తుంటే చియాన్ హిట్ కొట్టబోతున్నాడనే విషయం అర్ధం అవుతుంది. ఒంటి మీద కేవలం అది కూడా పంచ లాంటి ఒక తెల్లటి వస్త్రం మాత్రమే ధరించి ఉన్న చియాన్ చాలా భీకరంగా ఉన్నాడు. పైగా కాళ్ళ దాకా జుట్టు కూడా వచ్చింది. .  ఒళ్ళంతా విబూది లాంటిది పూసుకొని శత్రువుల మీదకి వెళ్తున్నాడు. తన నడక హావభావాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు  తన రూపాన్ని చూస్తుంటేనే  ఒళ్ళు జలదరించినట్టుగా ఉంది. పూర్తిగా చెప్పాలంటే చియాన్  తన నట విశ్వ రూపాన్ని చూపించబోతున్నాడు

తంగలాన్ కోసం చియాన్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జియో స్టూడియోస్. జ్ఞానవేల్  నిర్మిస్తుండగా పా రంజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.అతి త్వరలోనే  విడుదలకి సిద్ధం అవుతుంది. మాళవిక మోహన్ ,పార్వతి తిరువొతు, డానియల్ పశుపతి తదితరులు  ఇతర పాత్రలో నటిస్తున్నారు.జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మా బంగారు కుమారుడికి మండుతున్న నివాళి పట్టుకోండి అనే పోస్టర్ తో ఆ  వీడియో రిలీజ్ చేసారు.