English | Telugu

అవసరమైతే టీ అమ్ముకుంటా.. నాలుగు గంటలు పట్టడం ఏంటమ్మా 

చియాన్ విక్రమ్(virkam) నయా మూవీ తంగలాన్.(thangalaan)పాన్ ఇండియా లెవల్లో  అగస్ట్ 15 న  రిలీజ్ కాబోతుంది.దీంతో  మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు. మాళవిక మోహనన్(malavika mohanan)పార్వతి తిరువోతు(parvathy thiruvothu)హీరోయిన్లు గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు  తంగలాన్ విశేషాలతో పాటు ఇంకొన్ని సీక్రేట్ లని  బయటపెట్టారు.

ఒక రిపోర్టర్ పార్వతి తో నటిగా కాకపోయి ఉంటే ఏ రంగంలోకి ప్రవేశించేవారని అడిగాడు. అందుకు  వెంటనే టీ షాప్  ప్రారంభించేదానినని చెప్పుకొచ్చింది.  వృత్తి ఏదైనా గౌరవంతో, మర్యాదతో పని చెయ్యాలనుకున్నా.అందులో  భాగంగానే టీ షాప్ పెట్టాలనుకున్నాను అని చెప్పింది. అదే విధంగా మూవీలోని తన క్యారక్టర్ గురించి కూడా  కొన్ని విషయాలని వెల్లడి చేసింది. గంగమ్మ అనే క్యారక్టర్ ని  పోషించాను. సదరు  క్యారక్టర్ బాగా రావడం కోసం ఎంతగానో శ్రమించా. భాష పరంగాను చాలా కసరత్తులు చేశాను. తప్పకుండా ప్రేక్షకులందర్నీ అలరిస్తుందని  చెప్పుకొచ్చింది. ఇక మాళవిక మాట్లాడుతు తంగ లాన్ షూటింగ్ నా లైఫ్ లో  ఎప్పుడు గుర్తుండిపోతుంది. మేకప్ వేసుకోవడానికే  నాలుగు గంటల సమయం పట్టేది. పైగా షూట్ మొత్తం  ఎక్కువ భాగం  ఎండలోనే జరిగేది.దాంతో  శరీరం పై దుద్దుర్లు కూడా  వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాంతో రోజు సెట్స్ లో డెర్మాలజిస్ట్, కళ్ళ డాక్టర్స్ ఉండే వాళ్లని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి   మాటలు ప్రేక్షకులని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఇక  కర్ణాటకలోని  కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏరియాలో జరిగిన కార్మికుల జీవిత కథ ఆధారంగా  తంగలాన్. తెరకెక్కింది. విక్రమ్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు.మూవీ మొత్తం కూడా దాదాపుగా ఒంటి మీద చొక్కా లేకుండా నటించాడు.  రజనీ కాంత్ తో కబాలి, కాలా వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన పా రంజిత్(pa ranjith) దర్శకుడు కాగా స్టార్ ప్రొడ్యూసర్  కే ఈ జ్ఞానవేల్ రాజా(K E Gnanavel Raja)నిర్మాత. వంద కోట్లకి పైగా భారీ వ్యయంతో నిర్మించాడు. డేనియల్ కల్టా గిరోనే, కల్కి ఫేమ్ పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.