English | Telugu
తంగలాన్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..ఇన్నాళ్లు రాకుండా చేసింది వీళ్ళే
Updated : Dec 10, 2024
చియాన్ విక్రమ్(vikram)హీరోగా పా రంజిత్(pa ranjith)దర్శకత్వంలో అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ 'తంగలాన్'(thangalaan).స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు, డానియల్,ప్రీతి కరణ్,పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నిఅందించాడు.
'తంగలాన్'ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చెయ్యడం జరిగింది.ఈ విషయాన్నీ'తంగలాన్' టీం అధికారకంగా ప్రకటించడమే కాకుండా ఒప్పందం ప్రకారం మూవీ రిలీజ్ రోజు టైటిల్స్ లో చెప్పడం జరిగింది.దీంతో థియేటర్ రిలీజ్ తర్వాత జరిగే ఓటిటి రిలీజ్ కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల సదరు సంస్థ ఓటిటి లో స్ట్రీమింగ్ చెయ్యలేదు.దీంతో ఒక దశలో తంగలాన్ ఓటిటి లో ఉండదేమో అనే టాక్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తు ఈ రోజు నుంచి 'తంగలాన్' ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చేయడమే కాకుండా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడి చెయ్యడం జరిగింది.
బ్రిటిష్ పరిపాలనాకాలంలో కొంత మంది బ్రిటిష్ వాళ్ళు'కోలార్ గోల్డ్' లో ఉన్నబంగారం కోసం ఒక గిరిజన తెగ కి చెందిన వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళకి నాయకుడు గా విక్రమ్ కనిపించగా, బంగారాన్ని కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి సంపాదించగలిగారా లేదా? ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలేంటి అనే పాయింట్ తో తంగలాన్ తెరకెక్కింది.విక్రమ్ తో పాటు చాలా మంది తమ పాత్రల కోసం ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఈ సినిమాలో నటించడం జరిగింది.