Read more!

English | Telugu

పవన్ హీరోగా సుకుమార్ సినిమా లేదు

పవన్ హీరోగా సుకుమార్ సినిమా లేదు అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల నాగచైతన్య హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" సినిమా చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ ని పిలిచి అభినందించారు. ఈ సందర్భంగా సుకుమార్ఎప్పుడో ప్రముఖ అల్లు అరవింద్ కి చెప్పిన కథతో సుకుమార్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా అతి త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి రానుందని మీడియాలో విభిన్న కథనాలు వెలువడ్డాయి.

కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత, అందుకు కారకుడు అల్లు అరవిందేననే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఆయనకు దూరంగా ఉంటున్నారని, అందువల్ల ఈ కామబినేషన్ లో సినిమా రాదనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. కారణం సుకుమార్ అరవింద్ ని కాదని పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడు...అరవింద్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమా చేయడనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. మొత్తానికి పవన్ హీరోగా సుకుమార్ సినిమా లేదు అనేది బలంగా వినిపిస్తున్న వాదన.