English | Telugu

‘రాబిన్‌హుడ్‌’పై సోషల్‌ మీడియా రిపోర్ట్‌ ఏమిటంటే..?

‘రాబిన్‌హుడ్‌’పై సోషల్‌ మీడియా రిపోర్ట్‌ ఏమిటంటే..?

నితిన్‌ హీరోగా ఛలో, భీష్మ వంటి మాస్‌ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న వెంకీ కుడుములకు ఆ రెండు సినిమాలు డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చాయి. ఆ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్‌ వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సినిమాకి కొంత వర్క్‌ చేయడం వల్ల డైరెక్టర్‌గా వెంకీకి కొంత గ్యాప్‌ వచ్చింది. అలా గ్యాప్‌ తీసుకున్న తర్వాత మళ్ళీ నితిన్‌తోనే ‘రాబిన్‌హుడ్‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా చేశాడు. ఈమధ్యకాలంలో నితిన్‌కి కూడా హిట్స్‌ లేవు. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తనకు రెండు సూపర్‌హిట్స్‌ ఇచ్చిన వెంకీ కుడుములతో సినిమా చేసే అవకాశం వచ్చింది. మార్చి 28న విడుదలైన ఈ సినిమా మొదటి షోకి సంబంధించి ఇప్పటికే సోషల్‌ మీడియాలో సినిమాపై రకరకాల ఒపీనియన్స్‌ కనిపిస్తున్నాయి. ఒక విధంగా సినిమా ఎలా ఉంది అనే టాక్‌ బయటికి వచ్చేసింది. 

సినిమా ఫస్ట్‌హాఫ్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెప్తున్నారు. సాంగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కాస్త బోర్‌ కొట్టినా ఓవరాల్‌గా ఫర్వాలేదు అని కామెంట్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న కామెడీ సినిమాకి ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.  సినిమాగానీ, క్యారెక్టర్స్‌గానీ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయని, చాలా చోట్ల ఇబ్బంది పడ్డామని మరికొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. నితిన్‌, రష్మిక కలిసి నటించిన ఛలో, భీష్మ చిత్రాలు వారికి మంచి జంటగా పేరు తెచ్చాయి. ఈ సినిమాలో కూడా వారిద్దరినే కంటిన్యూ చెయ్యాలనుకున్నారు. కానీ, రష్మిక అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీలీలను అప్రోచ్‌ అయ్యారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన ఎక్స్‌ట్రార్డినరీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మళ్ళీ శ్రీలీలనే రిపీట్‌ చేశారు. అయితే సినిమాలో శ్రీలీల ఆడియన్స్‌ని కొంత ఇబ్బంది పెట్టేలా కనిపించిందనే టాక్‌ వినిపిస్తోంది. 

వెంకీ కుడుముల సినిమాల్లో కామెడీ డిఫరెంట్‌గా ఉంటుందని అందరూ అంటారు. ఈ సినిమాలో కూడా దాన్నే మెయిన్‌టెయిన్‌ చేశారని తెలుస్తోంది. ఫస్ట్‌ హాఫ్‌ కామెడీ పరంగా ఓకే అనిపించుకుంది. సినిమాలోని అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ సూపర్‌గా ఉందనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఇక డేవిడ్‌ వార్నర్‌ కేమియో కూడా సినిమాకి బాగా ప్లస్‌ అవుతుందని చెబుతున్నారు. కంటెంట్‌ పరంగా ఫస్ట్‌హాఫ్‌ కాస్త డల్‌ అనిపించినప్పటికీ సెకండాఫ్‌లో దాన్ని కవర్‌ చేశారంటున్నారు. సెకండాఫ్‌లోని ఎపిసోడ్స్‌ అన్నీ వర్కవుట్‌ అయ్యాయంటున్నారు. ఇప్పటివరకు సోషల్‌ మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు ‘రాబిన్‌హుడ్‌’ గురించి పాజిటివ్‌గానే చెబుతున్నారు. మరి అసలు సినిమా కథ ఏమిటి, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది, డైరెక్టర్‌ టేకింగ్‌ ఎలా ఉంది, ఓవరాల్‌గా సినిమా రిజల్ట్‌ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఫుల్‌ రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.