Read more!

English | Telugu

ఓవర్ సీస్ లో మహేష్ బాబే నంబర్ వన్ హీరో

ఓవర్ సీస్ లో మహేష్ బాబే నంబర్ వన్ హీరో అని గణాంకాలు చెపుతున్నాయి. తెలుగు సినిమా ఓవర్ సీస్ కలెక్షన్లు కోటి రూపాయలు దాటించిన ఘనత మాత్రం ప్రిన్స్ మహేష్ బాబుకే దక్కుతుంది. మహేష్ బాబు హీరోగా నటించిన "అతడు" సినిమా ఈ రికార్డుని సాధించింది. ఆ తర్వాత "పోకిరి" కూడా అదే ప్రభంజనాన్ని కొనసాగించింది. మొన్నటి ఫ్లాపయిందనుకున్న "ఖలేజా" సినిమా కూడా ఓవర్ సీస్ లో బాగానే వసూలు చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన "మగధీర" అయిదుకోట్లు ఓవర్ సీస్ లో కలెక్ట్ చేసింది.

దర్శకులలో శేఖర్ కమ్ములకు ఓవర్ సీస్ మార్కెట్లో గట్టి పట్టుంది. అతని "గోదావరి, హ్యాపీడేస్" సినిమాలు ఓవర్ సీస్ లో బాగా కలెక్ట్ చేశాయి. "హ్యాపీడేస్" సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన "పోకిరి" కంటే ఎక్కువ వసూలు చేయటం విశేషం. ఇప్పటికి తెలుగు సినీ పరిశ్రమ వరకూ ఓవర్ సీస్ మార్కెట్లో నంబర్ వన్ హీరోగా మహేష్ బాబుకే స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు.