English | Telugu

స్టైలిష్ చిరునా లేక క్లాసిక్ బాలయ్యా

స్టైలిష్ చిరునా...? లేక క్లాసిక్ బాలయ్యా...? అన్న ప్రశ్న ఈ మధ్య మన ఫిలిం నగర్ లో రాజ్యమేలుతోంది. ఇంతకీ విషయమేమిటంటే కోర మీసం ఎవరికి బాగుంటుంది. చిరంజీవికా...? లేక బాలయ్యకా...? అదీ ప్రశ్న. అంతే కాదు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఫ్యాక్షన్ లీడర్ల వేషాలను సినిమాల్లో నటించారు.

"ఇంద్ర" సినిమాలో ఇంద్రసేనారెడ్డిగా మెగా స్టార్ చిరంజీవి నటిస్తే, యువరత్న బాలకృష్ణ "సమరసింహారెడ్డి"గా "చెన్నకేశవ రెడ్డి"గా, "నరసింహ నాయుడు"గా మూడు చిత్రాల్లో ఫ్యాక్షన్ లీడర్ గా నటించారు. గంజిపెట్టిన ఖద్దరు చొక్కా, కోర మీసం కళ్ళకి గాగుల్స్ ఇవి ఫ్యాక్షన్ లీడర్ గెటప్పుకి ఆనవాళ్ళుగా మన తెలుగు సినిమాల్లో నిలిచాయి. మరి ఈ ఫ్యాక్షన్ లీడర్ గెటప్పు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరికి బాగా సెట్టయ్యిందో మీరే చెప్పాలి.