Read more!

English | Telugu

తొంబై ఏళ్ళ వేడుక నిర్వహిస్తున్నాను 

నేడు తెలుగు సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసే పరిస్థితి. అంతటి ఖ్యాతిని తెలుగు సినిమా ఓవర్ నైట్ సంపాదించలేదు. అహర్నిశలు  శ్రమిస్తు ఎన్నో అద్భుతమైన కథల్ని ఎంచుకొని ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ఫెస్టివల్ మూడ్ లోకి ఎంటర్ అవ్వబోతుంది

 తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ సంపదని తెలియచేసేలా తెలుగు సినిమా తొంభైయేళ్ల వేడుక జరగబోతుంది.  ఈ విషయాన్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు  తెలిపాడు. జులై 26 న  మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని బూకీట్ జలీల్ ప్రతిష్టాత్మక స్టేడియంలో జరగనున్నాయి. ఇటీవలే అందుకు సంబంధించిన ఏర్పాట్లు  మీద విష్ణు మలేసియాలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసాడు. మలేషియాలోని తెలుగు మాట్లాడే ప్రజల మధ్య స్థానికుల మధ్య ఈ వేడుకలు ఒక వారధిగా నిలుస్తాయని కూడా  తెలిపాడు

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మలేసియా టూరిజం, ఎం సి ఎంటర్ టైన్మెంట్స్ లు ఈ కార్యక్రమంలో భాగం కానున్నాయి. మొదటి తెలుగు సినిమా  భక్త ప్రహ్లద.1932 ఏప్రిల్ 2 న విడుదల అయ్యింది.సంవత్సరం తర్వాత  అయినా వేడుకలు జరగడం శుభపరిణామం. ఇక విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే చారిత్రాత్మక మూవీని  చేస్తున్నాడు. పరమేశ్వరుడికి భక్తితో తన రెండు కళ్ళు సమర్పించిన కన్నప్ప జీవిత  కథ ఆధారంగా తెరకెక్కుతుంది. నిర్మాత కూడా విష్ణునే