Read more!

English | Telugu

త‌మ‌న్నా...అన్నీ బిల్డ‌ప్పులేనా?

క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌కు రోజురోజుకీ రేంజు పెరుగుతోంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఇది వ‌ర‌కు రెండు మూడు కోట్ల‌లో సినిమా లాగించేద్దాం అనుకొనేవాళ్లు. అనుష్క‌, న‌య‌న‌తార లాంటి క‌థానాయిక‌ల పుణ్య‌మా అని బ‌డ్జెట్ ఒక‌టికి ప‌దింత‌ల‌య్యింది. అనుష్క హీరోయిన్ అంటే రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డానికి కూడా వెనుకంజ వేయ‌డం లేదు. ఇప్పుడు త‌మ‌న్నా కూడా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి మ‌ళ్లించింది. త‌మిళ‌నాట విజ‌య్ ద‌ర్శక‌త్వంలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా అభినేత్రి అనే సినిమా రెడీ అవుతోంది. త‌మ‌న్నాకి తెలుగులో, ప్ర‌భుదేవాకి హిందీలో క్రేజ్ ఉంది కాబ‌ట్టి.. ఈ సినిమాని తెలుగు, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. అయితే మా సినిమాకి ఏకంగా రూ.70 కోట్ల బ‌డ్జెట్ పెట్టాం.. అంటూ చిత్ర‌బృందం డ‌బ్బాలు కొట్టుకొంటోంది.

అనుష్క సినిమాల‌కే రూ.50 కోట్లు పెడితే తిరిగి రావ‌డం లేదు. ఇక‌... త‌మ‌న్నాకి అంత పెడ‌తారా?  పెట్టినా తిరిగొస్తాయా??  పైగా ఓవ‌ర్సీస్ రైట్స్ అమ్ముడుపోయాయ‌ని ఈ సినిమాకి రూ.9 కోట్ల‌కు కోన వెంక‌ట్ కొనుక్కొన్నాడ‌ని మ‌రో ఫీల‌ర్ వ‌దిలారు. త‌మ‌న్నా సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో అంత రేటిస్తారా??  బ‌డా బ‌డా స్టార్ హీరోల సినిమాల‌కే అంత ప‌ల‌క‌డం లేదు. అలాంట‌ప్పుడు  త‌మ‌న్నాని న‌మ్మి ఆ సినిమాని తొమ్మిది కోట్ల‌కు కొంటారా??  ఇదంతా అభినేత్రి టీమ్ ఆడుతున్న బిజినెస్ ట్రిక్ అన్న‌ది అర్థ‌మైపోతూనే ఉంది. ఇక‌నైనా ఈ బిల్డ‌ప్ డ్రామాని క‌ట్టిపెట్టి టీమ్ అంతా క‌ల‌సి ఓ మంచి సినిమా తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే మంచిది. సినిమా బాగుంటే.. కోట్లు వాతంత‌ట అవే వ‌స్తాయి. సినిమా ఫ్లాప‌యితే.. ఇవి కాకిలెక్క‌ల‌న్న సంగ‌తి అర్థ‌మైపోతుంది. ఏం జ‌రుగుతుందో చూద్దాం.