Read more!

English | Telugu

సుశాంత్ ' ఆటాడుకుందాం రా ' టీజర్ టాక్

కింగ్ నాగార్జున పాటల్లో చాలా ఫ్యామస్ ' ఆటాడుకుందాం రా అందగాడా ' పాట. దాన్నే తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టుకుని, మరోసారి సక్సెస్ కోసం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అక్కినేని వారబ్బాయి సుశాంత్. కెరీర్ మొదలై చాలా కాలమే అయినా, సుశాంత్ కు ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ పడలేదు. అందుకే ఈసారైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. కానీ ' ఆటాడుకుందాం రా ' టీజర్ చూస్తే మాత్రం, రొటీన్ కథతోనే సుశాంత్ వస్తున్నాడని అర్ధమైపోతుంది. ప్రపంచంలో అందర్నీ మోసం చేసేయగల హీరో, అందం చూపించడానికే అన్నట్టుగా ఉండే హీరోయిన్, హీరో క్యారెక్టరైజేషన్ ను అస్సలు ఇష్టపడని తండ్రి, తన ప్రేమను గెలుచుకోడానికి హీరో ప్రయత్నం, ఆ ట్రయిల్స్ లో భాగంగా వాడుకోవడానికి బకరా బ్రహ్మి, హీరోకు హెల్ప్ గా కామెడీ జనరేట్ చేయడానికి సినిమా డైరెక్టర్ గా 30 ఇయర్స్ పృథ్వీ,వెన్నెల కిషోర్. ఇదీ టీజర్ లో ఉన్న విషయం.

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో, చిన్న పెద్ద సినిమా అని చూడకుండా, కథ బాగుంటే సూపర్ హిట్ చేసి పెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సుశాంత్ ఏదైనా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఇలాంటి స్టోరీతోనే పెద్ద హీరోల లీగ్ అయిన వేసవికి వచ్చే సాహసం చేస్తున్నాడు. సుశాంత్ సరసన్ సోనం బజ్వా హీరోయిన్ గా నటించింది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి మరి.