English | Telugu

సూర్యని ఎందుకు మోస్తున్నారు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సూర్య(suriya)నటించిన  పాన్ ఇండియా మూవీ  కంగువ(kanguva)నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.మూడు వందల కోట్ల రూపాయలకి పైన భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ మూవీలో దిశా పటాని, బాబీ డియోల్,నటరాజన్ సుబ్రమణ్యం వంటి భారీ తారాగణం ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రిలీజ్ తో సూర్య  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

కొన్ని రోజుల నుంచి తెలుగులో కంగువ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.ఈ మేరకు రీసెంట్ గా వైజాగ్ లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో సూర్య తో పాటు చిత్ర దర్శకుడు శివ(siva)ప్రముఖ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan)పాల్గొన్నారు.ఈ సందర్భంగా  సూర్యని ఉద్దేశించి శివ కొన్ని ప్రశ్నలు వేసాడు. మీతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాను.చాలా ప్లేస్ లకి ఇద్దరం కలిసి వెళ్ళాం.అన్ని చోట్ల మీకు చాలా ప్రేమ దొరుకుతుంది ,అందరు మిమ్మల్ని నిజంగా హార్ట్ నుంచి ప్రేమిస్తున్నారు.

ఈ విషయాన్ని కేరళ,తమిళనాడు, ముంబై, హైదరాబాద్ లో చూసాను. ఇప్పుడు వైజాగ్ లో చూస్తున్నాను. ఇంత మంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా, ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నారని మీకు అనిపిస్తుందని అడిగాడు. అందుకు సూర్య మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ కి రాకముందు ఏమని అనుకున్నానంటే సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రేమ వలన ఇక్కడ ఉన్నారని అనుకునే వాడ్ని, కానీ ఆ తర్వాత అర్థమైంది ప్రజల ప్రేమ వల్లే ఇక్కడ ఉన్నానని చెప్పుకొచ్చాడు.