Read more!

English | Telugu

సూర్య ' మేము ' వాయిదా పడింది

తమిళ స్టార్ సూర్య యాక్ట్ చేసిన పసంగ-2 తెలుగులో మేము అనే పేరుతో డబ్ అయింది. సూర్య, అమలాపాల్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో సాయి మణికంఠ క్రియేషన్స్ బ్యానర్ పై జూలకంటి మధుసూధన్ రెడ్డి అందిస్తున్నారు. తమిళంలో 2015 వచ్చి హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో రావడానికి మాత్రం టైం తీసుకుంటోంది. గత కొద్ది కాలంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న మేము ఈ 18న రిలీజ్ కావాల్సి ఉంది. తాజాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నామని, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు. దీంతో మేము మరింత వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో  చూడాల్సి ఉంది.