English | Telugu

అయ్ బాబోయ్... ఇది ఫస్ట్ లుక్కా...?

ఏ సినిమాకైనా ఫస్ట్ లుక్ అంటే అదిరిపోయే రెంజులో ఉంటాయి. అది చిన్న, పెద్ద అనే సినిమా అనే తేడా లేకుండా ఆ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉండేదే ఫస్ట్ లుక్. అలాంటిది ఫస్ట్ లుక్ అంటే పాస్ పోర్ట్ సైజు ఫోటో అని కొత్త అర్థం తెచ్చాడు భీమవరం బుల్లోడు.ఇంతకీ అతనేవరనుకుంటున్నారా? సునీల్ హీరోగా "భీమవరం బుల్లోడు" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సునీల్ కొత్తగా కనిపించబోతున్నాడు అంటే అతని పాత చిత్రాల కంటే కొంచెం కొత్తగా కనిపించబోతున్నాడని అనుకుంటాం. కానీ సునీల్ పాస్ పోర్ట్ సైజు ఫోటో ఒకటి నెట్ లో విడుదలైన దానినే ఫస్ట్ లుక్ గా భావించే పరిస్తితి ఏర్పడింది. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదే అయితే ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.