Read more!

English | Telugu

ఏపీ ఎన్నికల బరిలో మరో సినీ స్టార్!

సినిమా వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్త కాదు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మే 13న జరగనున్న ఎన్నికల బరిలో ఎందరో సినిమా వారు నిలిచారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా వంటి సినీ స్టార్స్ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు మరో సినీ స్టార్ కూడా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బోండా ఉమామహేశ్వర రావు, వైఎస్సార్సీపీ తరపున వెలంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మరి స్వతంత్ర అభ్యర్థిగా జొన్నవిత్తుల ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి.