English | Telugu
అమరన్ ని చూసిన ముఖ్యమంత్రి.. ప్రత్యేకంగా షో వేసుకొని మరి
Updated : Nov 1, 2024
శివకార్తికేయన్(siva karthikeyan)సాయి పల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి రామస్వామి పెరియార్(raj kumar periyaswami)దర్శకత్వం వహించగారాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్(kamal haasan)నిర్మించడం జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(stalin)రీసెంట్ గా అమరన్ ని చూడటం జరిగింది. స్టాలిన్ కోసం చిత్ర బృందం ప్రత్యేక స్క్రీనింగ్ ని ఏర్పాటు చెయ్యటంతో స్టాలిన్ చివరకి వరకు మూవీ ని వీక్షించారు. అనంతరం ఇలాంటి మంచి సినిమా తీసినందుకు నటినటుల్ని దర్శకుడ్ని, నిర్మాతని అభినందించారు. అనంతరం అధికారకంగా సోషల్ మీడియా ద్వారా సినిమా చాలా బాగుందని పోస్ట్ చేసారు.మేజర్ ముకుంద్ స్వస్థలం తమిళనాడులోని తాంబరం.
అమరన్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతూ వరల్డ్ వైడ్ గా తొలి రోజు ముప్పై నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్యామ్ మోహన్, వంటి వారు ప్రధాన పాత్రల్లో చెయ్యగా జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.