English | Telugu

కొర‌టాలకు కిక్కు నెత్తికెక్కిందా?

విజ‌యంతో పాటు 'విన‌యం' కూడా కల‌సి రావాలి అనిచెప్తుంటారు పెద్ద‌లు. విజ‌యం తాలుకు గ‌ర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా, ఎన్ని విజ‌యాలొస్తే అంత త‌లొగ్గి ఉండ‌డ‌మే అస‌లు సిస‌లైన విజేత ల‌క్ష‌ణం. అయితే ఈ టైపు క్యారెక్ట‌ర్ల‌ను తెలుగు చిత్ర‌సీమ‌లో అరుదుగానే క‌నిపిస్తుంటారు. ఒక్క హిట్టు ప‌డ‌గానే అంతా తామే చేసిన‌ట్టు పోజులు కొడుతుంటారు. త‌మ వెనుకే ప్ర‌పంచం ప‌రుగులు పెడుతున్న‌ట్టు ఫీలైపోతుంటారు. ఇప్పుడు కొర‌టాల శివ‌కూ అలాంటి కిక్కే నెత్తిమీద ఎక్కిందా అనిపిస్తుంటుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీ‌మంతుడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకెళ్లిపోతుంది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కూ మార్కులు ప‌డ్డాయి.

ఆ మాత్రం చేత ఆ సినిమాలో లోపాలు లేక‌పోలేదు క‌దా. ఇదే విష‌యం కొర‌టాల‌ని అడిగితే ఆయ‌న‌కు కాస్త కోపం వ‌చ్చింది. త‌ల‌తిక్క స‌మాధానాల‌తో పాత్రికేయుల్ని కాసేపు తిక‌మ‌క‌పెట్ట‌డానికి ట్రై చేశారాయ‌న‌. ఆదివారం హైద‌రాబాద్ లో శ్రీ‌మంతుడు ప్రెస్ మీట్ జ‌రిగింది. క‌న్న‌కొడుకు ఎక్క‌డికెళ్లాడో, ఏం చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్య‌త తండ్రికి ఉండదా? ఆ పాయింట్‌ని ఎందుకు మిస్ అయ్యారు అన్న ఓ పాత్రికేయుడి ప్ర‌శ్న‌కు కాస్త వెట‌కారంగా, ఇంకాస్త ఘాటుగా స‌మాధానం ఇచ్చాడు కొర‌టాల‌. అలాంటి సీన్ల‌న్నీ చేరిస్తే సినిమా తొమ్మిది గంట‌ల‌వుతుందండీ. అంత అవ‌స‌ర‌మా?? అని ఎదురు ప్ర‌శ్నించాడు. మ‌రో ప్ర‌శ్న‌కు రైతు కూలీలు ఊరు వ‌దిలి వెళ్ల‌కూడ‌దు, వెళితే నేనైతే కొట్టి ఆపుతా.. అన్నాడు. ఈ స‌మాధానాలే చెబుతాయి ఈ ద‌ర్శ‌కుడికి విజ‌యాల కిక్కు ఎక్కేసింద‌ని. అయితే మ‌రో వైపు మ‌హేష్ మాత్రం అన్నింటికీ న‌వ్వుతూ, చాలా బ్యాలెన్స్‌గా స‌మాధానాలు చెప్పుకొచ్చాడు. సూప‌ర్ స్టార్లు ఊర‌కే అవుతారా. ఈ విష‌యం కొర‌టాల ఎప్పుడు తెలుసుకొంటాడో.?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.