English | Telugu

ఫస్ట్ డే కలెక్షన్స్..30కోట్ల శ్రీమంతుడు

శ్రీమంతుడు ఏ రేంజు లో థియేటర్ లలో సందడి చేస్తున్నాడో తెలియాలంటే ఈ కలెక్షన్ల ను చూడాల్సిందే.కేవలం నైజాం లోనే తొలిరోజున 5.6 కోట్లు వసూలు చేసింది శ్రీమంతుడు. ఇకపోతే ఆంధ్ర లో ఏకంగా 7.9 కోట్లు వచ్చింది. మొత్తంగా చూస్తే ఏపి-నైజాం కలుపుకొని శ్రీమంతుడు సినిమా 13.51 కోట్లు వసూలు చేసింది. ఆ దెబ్బకి తొలిరోజు వసూళ్ళ లో అత్తారింటికి దారేది పేరిట ఉన్న 10.75 కోట్ల ఏపి-నైజాం రికార్డు బ్రేక్ అయిపోనట్లే. డే వన్ సూపర్ హిట్ టాక్ రాకపోతేనే మహేష్ బాబు సినిమాలకు ఓ రేంజులో వసూళ్ళు వస్తాయి. అటువంటిది డే వన్ హిట్ టాక్ వస్తే ఇక సీన్ ఇలాగే ఉంటుంది.

ఇకపోతే అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్కును దాటేసుకొని ఏకంగా శ్రీమంతుడు 8.55 కోట్లు వసూలు చేశాడు. తక్కిన దేశాల్లో కలుపుకుంటే ఇంకో 1.08 కోట్లు వచ్చింది. ఇక కర్ణాటక (2.02 కోట్లు) ఉత్తర భారత్ (0.92) తమిళనాడు (0.56)లను కలుపుకుంటే మొత్తంగా శ్రీమంతుడు సినిమా తొలిరోజున 30.14 షేర్ వసూలు చేసినట్లు. ''బాహుబలి'' సినిమా తరువాత ఇక టాలీవుడ్ లో ఇదే టాప్ షేర్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.